- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మానుకోట ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన మెగాస్టార్ చిరంజీవి
దిశ, మహబూబాబాద్: మానుకోట నా అభిమాన కోట అంటూ మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులను ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో గుర్తు చేసుకున్నారు. మానుకోటలో ఎంతో మంది తనకు అభిమానులుండటం సంతోషించదగ్గవిషయమని అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత లేకుండా ఉండేందుకు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ నుంచి సిలిండర్లను మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు చిరంజీవి ఫోన్ చేసి మాట్లాడారు. హలో శంకర్ ఎలా ఉన్నారు..! కుటుంబ సభ్యులు బాగున్నారా..! ప్రజల్లో బాగా తిరుగుతారు పరిస్థితులు బాగలేవు, ప్రజలకు బాగా ఉపయోగపడే వ్యక్తి మీరు, మీ ఆరోగ్యం జాగ్రత్త తగు జాగ్రత్తలు తీసుకోండి.. ప్రజల్లో బాగా గుర్తింపు పొందారు అంటూ సంభాషణ సాగించారు. అడిగిన వెంటనే జిల్లాకు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ని అందించినందుకు మెగాస్టార్‌కు శంకర్‌నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.