- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మెగా బ్రదర్స్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ
దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పటి మూవీ ఇండస్ట్రీకి..ప్రజెంట్ ఇండస్ట్రీకి చాలా తేడా ఉంది. అప్పటి మాదిరి సినిమాలకు..50 రోజులు, వంద రోజులు, రెండొందల రోజులు సెలెబ్రేషన్స్ లేవు ఇప్పుడు. ఇప్పుడంతా కలెక్షన్లు..ఓటీటీలు..ఓవర్‌సీస్ బిజినెస్ వచ్చేసింది. యంగ్ హీరోలు వచ్చారు. కొత్తదనం వచ్చింది. అయితే అప్పట్లో హీరోలు ఏడాదికి నాలుగు లేదా ఐదు సినిమాలు చేస్తే..ఇప్పటి వారు ఒకటి లేదా రెండు చేయడమే గగనంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలు 90ల్లో ఏటా నాలుగు లేదా ఐదు సినిమాలు విడుదలయ్యేవి. ప్రస్తుత పరిస్థితులు అలా లేవు. కాగా, రాజకీయాల్లోకి వెళ్లి..ఇండస్ట్రీకి ‘ఖైదీ నెం.150’ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్..ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయ్యారు. చిరు తమ్ముడు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కూడా రాజకీయాల్లోకి వెళ్లి ఇక సినిమాలు చేయబోనన్నాడు. కానీ, ఆర్థిక పరిస్థితుల రిత్యా సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించి..ప్రస్తుతం సినిమాలు, రాజకీయం రెండూ చేస్తున్నారు. ఇలా మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్ రాజకీయ అరంగేట్రం..పరిస్థితుల రిత్యా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ తర్వాత వరుస చిత్రాలు ప్రకటిస్తుండటంతో మెగా అభిమానులు ప్రస్తుతం చాలా ఆనందంగా ఉన్నారు. యంగ్ హీరోస్‌తో పోటీపడుతూ సినిమాలు చేయడం పట్ల ఫుల్ ఖుషీగా ఉన్నారట.
మెగాబ్రదర్స్ ఇలా వరుస సినిమాలు ప్రకటించడం ద్వారా ఇండస్ట్రీలో హెల్తీ అట్మాస్పియర్ నెలకొంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పెద్దహీరోలు చిత్రాలు త్వరగా రిలీజై థియేటర్లలోకి వస్తే అటు అభిమానులు ఇటు డిస్ట్రిబ్యూటర్స్ యావత్ సినిమా లోకం ఆనందంగా ఉంటుందని చెప్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం ‘ఆచార్య’లో నటిస్తోన్న మెగాస్టార్ చిరంజీవి..ఆ తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్, మెహర్ రమేశ్ డైరెక్షన్‌లో ‘వేదాళం’ రీమేక్, బాబీ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మధ్య ఈ నలుగురు దర్శకులతో దిగిన ఫొటోను చిరు ట్విట్టర్ వేదికగా ‘చార్ కదమ్’ అని పేర్కొంటూ ట్వీట్ చేశాడు. బాబీ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో నటించారు. కాగా, పవన్ ఎవరూ ఊహించని విధంగా మూవీస్ చేస్తున్నారు. వరుస షూటింగ్‌లతో బిజీ బిజీగా గడుపుతున్నారు.
బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అనౌన్స్‌మెంట్స్‌తో సర్‌ప్రైజ్ చేస్తున్నాడు పవర్ స్టార్. వేణుశ్రీరాం దర్శకత్వంలో ‘వకీల్‌సాబ్’ సెట్స్‌లో ఉండగానే మూడు సినిమాలు సైన్ చేశాడు. క్రిష్ డైరెక్షన్‌లో ఓ పాన్ ఇండియా హిస్టారిక్ డ్రామాకు ఓకె చెప్పిన పవన్..ఆ తర్వాత సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ‘అయ్యప్పునుమ్ కోషియుమ్’ రీమేక్‌లో నటించనున్నారు. ఇందులో రానా కీలక పాత్ర పోషిస్తుండగా..ఈ మూవీకి మాటలు, స్క్రీన్ ప్లే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించనున్నారు. ఇక దీని తర్వాత పవర్‌స్టార్ అభిమాని ‘గబ్బర్‌సింగ్’ దర్శకుడు హరీశ్ శంకర్‌తో ఓ సినిమా చేయనున్నారు. ఈ ఏడాది ‘వకీల్‌సాబ్’తో పాటు మూడు చిత్రాలను రిలీజ్ చేయాలని పవన్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇలా మెగా బ్రదర్స్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అనౌన్స్ చేసి..షూటింగుల్లో పాల్గొనడం పట్ల..మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. బాక్సాఫీసుకు ముందుంది ఊచకోత అని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పటిలాగా హీరోలు త్వర త్వరగా చిత్రాలు చేయడం శుభపరిణామమని, అయితే షూటింగులు ఏళ్ల తరబడికాకుండా నిర్ణీత సమయంలో పూర్తి చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.