- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీడియో కాన్ఫరెన్స్ సెగ్మెంట్‌లో.. ఎయిర్‌టెల్ ‘బ్లూ జీన్స్’
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా రిమోట్ వర్క్ పెరగడంతో.. ‘వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్’కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే జూమ్, జియో మీట్, మైక్రోసాఫ్ట్ టిమ్స్‌లు పోటీపడుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో ఎయిర్‌టెల్ కూడా చేరింది. వెరిజోన్ సంస్థకు చెందిన ‘బ్లూ జీన్స్’ అనే వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్‌తో తాజాగా ఎయిర్‌టెల్ జట్టు కట్టింది.
జియోమీట్.. కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుండగా, ఎయిర్‌టెల్ ‘బ్లూ జీన్స్’ మాత్రం ఎంటర్‌ప్రైజెస్ కస్టమర్లకు మాత్రమే అవలేబుల్‌గా ఉంటుంది. ఇదేం కొత్తగా లాంచ్ అవుతున్న వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ కాదు. ‘బ్లూ జీన్స్ నెట్‌వర్క్’ పేరుతో 2009లోనే మార్కెట్లోకి వచ్చింది. ఆ తర్వాత 2011లో వెరిజోన్ అనే కంపెనీ దీన్ని సొంతం చేసుకోగా.. ప్రస్తుతం ఇందులో ఎయిర్‌టెల్ పెట్టుబడులు పెట్టింది. కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో బ్లూ జీన్స్ హెడ్ క్వార్టర్స్ ఉంది.
లాక్‌డౌన్ టైమ్‌లో ‘బ్లూ జీన్స్’ మరింత ఆదరణ దక్కించుకుంది. క్లౌడ్ బేస్డ్ సర్వీస్ అందించే ఈ యాప్.. కాన్ఫరెన్స్‌లకు మంచి యాప్‌గా గుర్తింపు పొందింది. ఇందులో లైవ్ స్ట్రీమ్స్, ఇంటారాక్టివ్ ఈవెంట్స్‌తో పాటు వెబ్ కాన్ఫరెన్స్ నిర్వహించుకునే వెసులుబాటు ఉంది. రూ. 950/-కు స్టాండర్డ్ ప్లాన్ సంవత్సర సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంది. బ్లూ జీన్స్ ప్రో సంవత్సర ప్లాన్ రూ. 1320/- ఉండగా, ఎంటర్‌ప్రైజెస్ ప్లాన్‌ను కంపెనీ కోటాలో తీసుకోవచ్చు.
ప్లాన్లను బట్టి మీటింగ్‌లో పాల్గొనే వారి సంఖ్య, రికార్డ్ చేసుకునే డ్యురేషన్ ఆధారపడి ఉంటాయి.