బ్లాక్ ఫంగస్‌కి హోమియోపతి మందులు

by Shyam |   ( Updated:2021-05-21 08:10:42.0  )
AYUSH Director Amrita Varshini
X

దిశ, తెలంగాణ బ్యూరో : బ్లాక్ ఫంగస్ వ్యాధికి హోమియోపతిలో మందులు అందుబాటులో ఉన్నాయని ఆయుష్ డైరెక్టర్ అమృత వర్శిణి ప్రకటించారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కరోనా నుంచి కోలుకున్న వారిలో కొత్తగా మ్యూటేషన్లు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. వీటి ద్వారా మ్యూకర్ మైకోసిస్ ఫంగస్ సోకి రోగి కళ్లు, ముక్కు, గొంతులపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ బ్లాక్ ఫంగస్ వ్యాధి నివారణకు హోమియోపతిలో సరైన మందులు ఉన్నాయని తెలిపారు.

ఆర్సెనిక్ ఆల్బమ్ 200ను మందులను ఉపయోగించడం వలన బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకకుండా ముందస్తుగా జాగ్రత్త పడవొచ్చని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వారు ఆలోపతి తో పాటు హోమియోపతి ఉపయోగించవచ్చని సూచించారు. బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి కాబట్టి హోమియోపతి బాగా ఉపయోగపడుతుందిని వివరించారు. చిన్న పిల్లలు కూడా ఈ హోమియోపతిలో ప్రివెంటివ్ మెడిసిన్ అందుబాటులో ఉందని చెప్పారు. ముఖ్యంగా మధుమేహ వ్యాధి తో బాధపడేవారు కోవిడ్ వచ్చిన తరువాత బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed