జర్నలిస్టులకు షాకిచ్చిన మీడియా అకాడమీ.. డేడ్‌లైన్ ఫిబ్రవరి 15..

by Shyam |
Telangana Media Academy
X

దిశ, తెలంగాణ బ్యూరో: జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు తమ లైఫ్ సర్టిఫికెట్లను వచ్చే ఏడాది ఫిబ్రవరి 15లోగా అందజేయాలని రాష్ట్ర మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు చెందిన లబ్ధిదారులు ఆయా జిల్లాలకు చెందిన డీపీఆర్వోల ద్వారా లైఫ్ సర్టిఫికెట్లను ధ్రువీకరించి మీడియా అకాడమీ కార్యాలయంలో అందజేయాలని కోరారు. లేని పక్షంలో 2022 మార్చి నుంచి పెన్షన్ నిలుపుదల చేస్తామని వెల్లడించారు. ఇంటి నెంబర్ 10-2-1, సమాచార భవన్, 2వ అంతస్తు, ఏసీ గార్డ్స్, మాసాబ్ ట్యాంక్, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాద్‌ అడ్రస్‌కు ధ్రువీకరణ పత్రాలను పంపవచ్చని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed