జెడ్పీ చైర్మన్ వర్సెస్ ఎంపీపీ

by Shyam |
జెడ్పీ చైర్మన్ వర్సెస్ ఎంపీపీ
X

దిశ, మేడ్చల్: జిల్లా టీఆర్ఎస్ పార్టీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. ఇప్పటికే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిల తీరుతో నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. పార్టీలో గ్రూపు రాజకీయాల వల్లనే గత పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ తరపున బరిలో నిలిచిన మంత్రి మల్లారెడ్డి స్వయాన అల్లుడైన మర్రి రాజశేఖర్ రెడ్డిని వ్యతిరేక వర్గం ఓడించినట్లు ప్రచారం జరిగింది. తాజాగా మాజీ ఎమ్మెల్యే కుమారుడు జిల్లా జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డికి ఘట్కేసర్ మండల కార్యాలయంలో ఓ గదిని కేటాయించడం పట్ల మేడ్చల్ టీఆర్ఎస్ పార్టీలో రాజకీయ దూమారం రేగింది. విషయం తెలుసుకున్న మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి ఎంపీడీఓను ప్రశ్నించారు. ఎంపీడీఓ పొంతనలేని సమాధానం చెప్పడంతో ఎంపీపీ సుదర్శన్ రెడ్డి అసహనానికి లోనయ్యారు. నాకు తెలియకుండా ఎంపీడీఓ కార్యాలయంలో ఇతరులకు ఛాంబర్లను ఎలా ఏర్పాటు చేస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరసనగా రెండు రోజులుగా కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపడుతున్నాడు.

Advertisement

Next Story

Most Viewed