- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలి
దిశ ప్రతినిధి,మేడ్చల్: రాష్ట్రంలోనే మేడ్చల్ జిల్లాను హార్టికల్చర్ (ఉద్యవనవన శాఖ)కు హబ్ గా తీర్చిదిద్దాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఈ విషయంలో అధికారులందరూ సమన్వయంతో పని చేస్తే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉద్యానవన పంటల సాగుపై జిల్లా హార్టికల్చర్ అధికారులతో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఉద్యానవనశాఖ ద్వారా రాబోయే మూడు సంవత్సరాల్లో జిల్లా వ్యాప్తంగా 36 వేల ఎకరాల్లో కమర్షియల్ పంటలను సాగులోకి తీసుకురావాల్సిన బాధ్యత అధికారులందరిపై ఉందని తెలిపారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని మంత్రి స్పష్టం చేశారు. అలాగే గ్రామాల్లో రైతు వేదికపై అన్ని పథకాలు, వాటికి సంబంధించిన వివరాలు, రైతుల పేర్లు, ఫోన్ నెబర్లను ఏర్పాటు చేయాలన్నారు. దీనివల్ల అటు అధికారులతో పాటు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. జిల్లాలోని రైతులను రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు కలుపుకొని పోవాలని అప్పుడే రైతులకు అవసరమైన అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు.