- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మెదక్ జిల్లా: వాహనాన్ని తనిఖీ చేసిన ఆ ఎస్సైకి ఒక్కసారిగా..

దిశ, మెదక్: ఉమ్మడి జిల్లాలో పోలీసులు భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం ఉదయం నాలుగు గంటలకు హుస్నాబాద్ ఎస్సై తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేశారు. అందులో భాగంగా ఓ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో భారీ మొత్తంలో 9 సంచుల్లో ఉన్న గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ విషయాన్ని ఏసీపీ మహేందర్ తెలిపారు. వీటి విలువ సుమారు 4 లక్షల 50 వేల రూపాయలు ఉంటుందని, వీటిని భూపాలపల్లి జిల్లా టేకుమాట్లకు చెందిన దావరవేని నారాయణరావు అనే వ్యక్తి బీదర్ నుంచి టేకుమాట్లకు తరలిస్తున్నట్లు తెలిపారు. అతనితో పాటు కారులో ఉన్న భూపాలపల్లి జిల్లాకు చెందిన నారేండ్ల చందు, కార్ డ్రైవర్ కుంభం రమేష్ లను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి కారును సీజ్ చేశారు. అదేవిధంగా హుస్నాబాద్ ఎస్సై సుధాకర్ తో పాటు సిబ్బందిని ఏసీపీ అభినందించారు.