- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఉద్యోగులకు రెట్టింపు వేతనం!
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా అనేక కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. చాలామందిని ఇంటి నుంచి పనిచేసేలా ప్రోత్సాహం ఇస్తోంది. అయితే, కొన్ని సంస్థలకు తప్పనిసరిగా ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పనిచేయాల్సి వస్తోంది. అలాంటి వాటిలో కమొడిటీ ఎక్స్ఛేంజ్, ఎమ్‌సీఎక్స్ కార్యాలయాలు కూడా. ఈ కార్యాలయాలకు వచ్చి పని చేసే ఉద్యోగులకు సాధారణ జీతం కంటే మూడు రెట్ల వేతనం ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. ఎమ్‌సీఎక్స్‌లో మొత్తం 400 మంది ఉద్యోగులుండగా..అందులో 300 మంది ముంబైలోనే విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ప్రస్తుత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కీలకమైన యాభై మంది ఉద్యోగులు గత వారాంతం నుంచి కార్యాలయం నుంచే విధులు నిర్వహిస్తున్నారు. అయితే, తమ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు, అడ్డంకులు లేకుండా రోజూ అవసరమైన వాటిని కార్యాలయంలోనే సమకూరుస్తున్నారు. ఆఫీసు బిల్డింగ్‌లోనే ఉద్యోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందిస్తున్నట్టు కార్యాలయం వర్గాలు చెబుతున్నాయి. కరోనా మహమ్మారి తీవ్రత, ప్రమాదాన్ని అధిగమిస్తూ వారు చేస్తున్న పనికి గుర్తింపు కోసం వారికి మూడు రెట్లు వేతనం ఇవ్వనున్నట్టు ఎమ్‌సీఎక్స్ వివరించింది. వీరిలో కొందరికి రెండు రెట్లు వేతనం ఇవ్వాలని కూడా నిర్ణయించినట్టు సంస్థ స్పష్టం చేసింది.