- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత అథ్లెట్ మయూకా జానీకి బెందిరింపులు
దిశ, స్పోర్ట్స్: భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ మయూకా జానీ, ఆమె కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. ఒక స్నేహితురాలికి సంబంధించిన రేప్ కేసులో మయూకా జానీ సహాయం చేస్తున్నందుకే ఈ బెదిరింపులు వస్తున్నాయని ఆమె మీడియాకు తెలిపారు. గతంలో ఒలింపిక్స్‌లో పాల్గొన్న మయూకా జానీ తనకు వచ్చిన బెదిరింపుల గురించి ఆదివారం తెలిపారు. ‘తన స్నేహితురాలు 2016లో జాన్సన్ అనే వ్యక్తి చేతిలో రేప్‌కు గురైంది. అప్పట్లో తన స్నేహితురాలి నగ్న చిత్రాలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. అయితే తాను ఈ విషయమై రాష్ట్ర పోలీసులు, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాను. మొదట్లో ఈ కేసుపై చురుకుగా వ్యవహరించిన పోలీసులు ఆ తర్వాత పట్టించుకోలేదు. దీని వెనుక కేరళ మాజీ పోలీసు అధికారి, మహిళా కమిషన్ అధికారులు ఉన్నారు. ఈ విషయాన్ని బహిర్గత పరిచినందుకే నాకు, నా కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయి’ అని మయూక చెప్పింది. ఈ బెదిరింపు లేఖ విషయంపై కూడా కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె వెల్లడించింది.