ఐపీఎల్‌లో నేడు మరో ఆసక్తికర పోరు

by Anukaran |
ఐపీఎల్‌లో నేడు మరో ఆసక్తికర పోరు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా గురువారం రాత్రి 7:30 గంటలకు ఆసక్తికర పోరు జరుగనుంది. ప్లే ఆఫ్స్‌లో ఛాన్స్ కోసం పోరాడుతున్న కోల్‌కతా, ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగనుంది. అయితే ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్‌కు అంత ముఖ్యమేమీ కాదు. అయితే వరుస అపజయాల తర్వాత గత మ్యాచ్‌లో చెన్నై జట్టు బలమైన బెంగళూరు జట్టును ఓడించింది. ఈ సీజన్‌ను విజయాలతో ముగించాలని భావిస్తున్నది.

ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే కోల్‌కతా జట్టు ఈ మ్యాచ్ తప్పకుండా గెలవాల్సి ఉన్నది. గత మ్యాచ్‌లో పంజాబ్ జట్టుపై ఓటమి చెందింది. బ్యాటింగ్ వైఫల్యం జట్టును వెంటాడుతున్నది. అయితే శుభమన్ గిల్, సునిల్ నరైన్, నితీశ్ రాణా వంటి యంగ్ బ్యాట్‌‌మెన్స్ ఫామ్‌లో ఉండటం.. బౌలింగ్ విభాగంలో కమ్మిన్స్, ఫర్‌గర్‌సన్, సునీల్ నరైన్‌లు రాణిస్తుండటం కోల్‌కతాకు కలసి వచ్చే అంశం. మరి ఏ జట్టు నెగ్గుతుందో వేచి చూడాలి.

Advertisement

Next Story