- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షిర్డీ వెళ్లొచ్చేసరికి రూ.2కోట్ల సొత్తు చోరీ
దిశ, క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సైనిక్‌పురి కాలనీలో భారీ చోరీ జరిగింది. ఘటనకు సంబంధించి డీసీపీ రక్షితామూర్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారి నరసింహారెడ్డి… తన కుమారుడి వివాహం నేపథ్యంలో షిర్డీకి వెళ్లారు. ఇదే క్రమంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆదివారం రాత్రి దొంగతనం జరిగింది. 1.73 కిలోల ఆభరణాలు, రూ.2లక్ష నగదుతో పాటు.. మొత్తం రూ.2కోట్ల విలువైన సొత్తు అపహరణకు గురైంది. ఆభరణాల్లో బంధువులవి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నరసింహారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు.
అయితే నరసింహారెడ్డి ఇంట్లో ఆరు నెలలుగా వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న నేపాల్‌కు వ్యక్తి కనిపించకపోవడంతో పాటు టూ వీలర్ కూడా సైనిక్ పురి చౌరస్తాలో ఉంది. కేసును సీసీ ఫుటేజీ, వాచ్‌మెన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్ట్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసినట్లు డీసీపీ తెలిపారు.