- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆలయంలో భారీ చోరీ.. 48 గంటల్లో నిందితుల అరెస్ట్
దిశ, వికారాబాద్: గుడిలో లింగమే కాదు.. గుడిని సైతం దోచేసేలా ఘరానా దొంగలు చెలరేగిపోతున్నారు. ఇలాంటి ఘరానా దొంగల ఆట కట్టించేందుకు పోలీసులు సైతం ఎత్తుకు పై ఎత్తులు వేసి.. వాళ్ల నేరాలకు చెక్ పెడుతున్నారు. తాజాగా.. ఇలాంటి ఘటనే వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వికారాబాద్ ఎస్పీ నారాయణ వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలోని శనేశ్వర ఆలయంలో ఈనెల 15వ తేదీన అర్ధరాత్రి ఆలయంలోని 6.2 కిలోల వెండి ఆభరణాలు గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. 16వ తేదీన ఉదయం ఆలయానికి వచ్చిన నిర్వాహకులు దొంగతనాన్ని గుర్తించి, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న మోమిన్‌పేట సీఐ వెంకటేశం, ఎస్ఐ శేఖర్ గౌడ్‌లు విచారణ చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన మహమ్మద్ ఖుద్దుల్, మహమ్మద్ ఖలీల్, మహమ్మద్ మారుప్‌లను మఫ్టీలో ఉన్న పోలీసులు సదాశివపేట సమీపంలో అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం వారినుంచి వెండి ఆభరణాలను, వస్తువులను అమీర్‌పేట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు ముగ్గురు గత కొన్ని సంవత్సరాలుగా అడవుల్లో గంధం చెట్లను నరికి అమ్ముకునేవారని ఎస్పీ వెల్లడించారు. లాక్‌డౌన్ వల్ల జన సంచారం లేకపోవడంతో ఆలయంలో ఆభరణాలు దొంగిలించారని అన్నారు. దేవాలయం వెనుక వైపు తలుపు పగులగొట్టి వెండి కిరిటాలు, ముత్యాల హారం, వెండి గొలుసులు, వెండి అభిషేకం చెందికలు, వెండి అంజనేయ స్వామి తొడుగు, వెండి అగరబత్తుల స్టాండ్, హంసా శంఖం, వెండి చక్రు, వెండి తీర్ధం పాత్రలను దొంగలించారని తెలిపారు. 2010లో కామారెడ్డి జిల్లా దేవునిపలిలో మారుఫ్‌పై కేసు నమోదు అయిందని ఎస్పీ తెలిపారు. వీరిని చాకచక్యంగా 48 గంటల్లో పట్టుకున్న మోమిన్‌పేట సీఐ వెంకటేశం, ఎస్ఐ శేఖర్ గౌడ్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా వారికి రివార్డులతో పాటు ప్రశంస పత్రాలను ఎస్పీ అందజేశారు. ఎస్పీతో పాటు మీడియా సమావేశంలో డీఎస్సీ సంజీవరావు, మోమిన్ పేట సీఐ వెంకటేశం, ఎస్ఐ శేఖర్ గౌడ్‌లు పాల్గొన్నారు.