పట్టపగలు ఇంట్లో చోరీ

by Anukaran |   ( Updated:2020-08-20 04:32:45.0  )
పట్టపగలు ఇంట్లో చోరీ
X

దిశ, రాజేంద్రనగర్ : మైలార్‌‌దేవ్‎పల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలో దొంగతనం జరిగింది. స్టేషన్ పరిధి దుర్గ నగర్‌లో ఓ ఇంటి తాళలు పగులగొట్టి చొరబడ్డ దొంగలు.. ఏడు తులాల బంగారం అపహరించారు. దీంతో పాటు 40 తులాల వెండి, 35 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వివరాళ్లోకి వెళితే.. ఓం ప్రకాశ్ అగర్వాల్ అనే వ్యక్తి కాటేదాన్‌లోని ఓ కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. అతడు తన ఫ్యామీలీతో దుర్గనగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే, బుధవారం ఎప్పటిలాగానే తాను డ్యూటీకి వెళ్లాడు. ఆ తర్వాత అతడి భార్య కూడా పిల్లలను తీసుకొని సమీపంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లింది.

ఇదే అదునుగా భావించిన దొంగలు.. ఇంట్లో వారు ఎక్కడికక్కడ వెళ్లగానే డోర్ పగుల గొట్టి ఇంట్లో చొరబడ్డారు. ఆ తర్వాత అందిన కాడికి దోచుకొని పరారీ అయ్యారు. సాయంత్రం 5 గంటలకు ఓం ప్రకాశ్ ఇంటికొచ్చి చూడగా డోర్ తెరిచే ఉంది. దీంతో లోపలికి వెళ్లి చూడగా దొంగతనం జరిగిందని గ్రహించి.. దిక్కుతోచని స్థితిలో పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌తో సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story