- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాస్క్ పెట్టుకోకపోతే.. జైలుకే
దిశ వెబ్ డెస్క్: కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడి చేయాలంటే.. విధిగా సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయాలి. అంతేకాదు అత్యవసర పనులు మీద బయటకు వెళితే.. తప్పనిసరిగా ముఖానికి మాస్క్ కట్టుకోవాలి. ఇప్పటికే ఈ నిబంధనలు ఉల్లంఘించిన పౌరులపై కొన్ని రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. జైలు శిక్ష లేదా ఫైన్ లేదా రెండు విధిస్తున్నాయి. ఇప్పుడు గుజరాత్ లోని అహ్మద్ బాద్ కూడా ఈ జాబితాలో చేరిపోయింది. అక్కడ మాస్క్ పెట్టుకోకపోతే మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని నగరపాలక సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
అహ్మదాబాద్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడంతో నగరపాలక సంస్థ సిటీలో ప్రతి ఒక్కరూ మాస్క్ లు పెట్టుకోవాలని సూచించింది. మాస్క్ ధరించకుండా కనపడితే రూ. 5 వేల జరిమానా లేదంటే మూడేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ కింద అహ్మదాబాద్ మునిసిపల్ కమిషనర్ విజయ్ నెహ్రా ఆదివారం ఈ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. మార్కెట్లో దొరికేవైనా, ఇంట్లో తయారుచేసిన వైనా ఫరవాలేదని ఆయన వివరించారు. కనీసం ముఖానికి రుమాలైనా కట్టుకోవాలని సూచించారు. వ్యాపారులు, దుకాణదారులు సహా పౌరులందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని అన్నారు. గుజరాత్ లో అత్యధికంగా అహ్మదాబాద్ లోనే కరోనా కేసులు నమోదు అవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.అహ్మదాబాద్ సిటీలో కరోనా సోకి 11 మంది చనిపోగా, 266 మందికి పాజిటివ్ వచ్చింది.
tags :coronavirus, face mask, gujarat, ahmedabad, fine, jail imprisonment