- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉత్పత్తిని సగానికి తగ్గించనున్న మారుతీ సుజుకి!
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో భారీగా కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా తన ఉత్పత్తి సామర్థ్యాన్ని సగానికి తగ్గించే యోచనలో ఉన్నట్టు వెల్లడించింది. దేశీయంగా ఆక్సిజన్ అవసరం అధికంగా ఉన్న కారణంగా కంపెనీ ఇప్పటికే కొన్ని ప్లాంట్లలో ఉత్పత్తిని ఆపేసింది. ఈ క్రమంలో ‘అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్, కర్ఫ్యూ అంక్షల వల్ల కంపెనీ అమ్మకాలపై తీవ్రంగా ప్రభావం పడింది. సగానికిపైగా డీలర్‌షిప్‌లు మూసేయబడ్డాయి. అయినప్పటికీ తాము 50-60 శాతం సామర్థ్యంతో కార్లను తయారీని నిర్వహించగలమని’ మారుతీ సుజుకి ఛైర్మన్ ఆర్ సీ భార్గవ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
గత మూడు రోజుల వ్యవధిలో కంపెనీ ఆర్డర్లలో 5 శాతం తగ్గినట్టు కంపెనీ వెల్లడించింది. ఈ పరిణామాలను బట్టి కరోనా మహమ్మారి రానున్న రోజుల్లో గిరాకీపై తీవ్రంగా ప్రభావితం ఉంటుందని అంచనా. ఇదివరకే కేంద్రం భారత్‌లో వైద్యానికి అవసరమైన ఆక్సిజన్‌ను ఇతర అవసరాలకు వినియోగించకూడదని ఆదేశాలు ఇచ్చింది. అయితే, కంపెనీలు కార్లను తయారు చేసేందుకు ఆక్సిజన్‌ను ఎక్కువగా వాడకపోయినప్పటికీ విడిభాగాల తయారీలో అధికంగా వినియోగిస్తాయి. కాగా, దేశంలో కరోనా సెకెండ్ వేవ్ వల్ల ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో ఆటో దిగ్గజం హీరో మోటోకార్ప్ అన్ని ప్లాంట్‌లలో కార్యకలాపాలను మూసేయగా, అశోక్ లేలాండ్ ఉతప్త్తిని తగ్గించింది.