మారుతీరావు కేసు: విచారణకు హాజరైన కారు డ్రైవర్

by Shyam |
మారుతీరావు కేసు: విచారణకు హాజరైన కారు డ్రైవర్
X

మిర్యాలగూడ వ్యాపారి మారుతీరావు ఆత్మహత్య కేసు విచారణలో ఆయన కారు డ్రైవర్ రాజేశ్‌ను గురువారం సైఫాబాద్ పోలీసులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా డ్రైవర్ పలు కీలక విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ బయల్దేరిన తర్వాత మార్గమధ్యంలో ఓ పురుగుల మందు వద్ద మారుతీరావు ఆగాడని అయితే, దుకాణంలోకి వెళ్లకుండానే వెనక్కి వచ్చాడని రాజేశ్ వివరించాడు. మారుతీరావుకు ఆ షాపు యజమాని పరిచయం కారణంగా తరచూ అక్కడికి వెళ్లేవారని పోలీసులకు తెలిపాడు.

ఆర్యవైశ్య భవన్‌కు చేరుకున్నాక ఇద్దరం కలిసి బయటకు వెళ్లి టిఫిన్ చేశామని తెలిపాడు. తిరిగి ఆర్యవైశ్య భవన్‌కు చేరుకున్నాక, తనకు ఇష్టమైన గారెలు తెప్పించుకుని తిన్నాడని డ్రైవర్ వివరించాడు. అనంతరం తాను కూడా అదే గదిలో నిద్రపోతానని చెప్పినా ఒప్పుకోలేదని, కారులో నిద్రపోమన్ని చెప్పడంతో వెళ్లిపోయనని డ్రైవర్ తెలిపాడు. ఇప్పటికే మారుతీరావు కాల్‌డేటాను సంపాదించిన పోలీసులు, రాజేశ్ కాల్‌డేటాను కూడా పరిశీలించాలని నిర్ణయించారు. అలాగే, మరోమారు అతడిని విచారించనున్నట్టు తెలుస్తోంది.

tag; maruthi rao case, car driver, ts news

Next Story