- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్కజ్ ప్రార్థనలే ఏపీ కొంపముంచాయా?
దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మార్కజ్‌లో జరిగిన మతపరమైన ప్రార్థనలే తెలుగు రాష్ట్రాల కొంప ముంచాయా?.. కేవలం విదేశాల నుంచి వచ్చిన వారి వల్లే కరోనా ప్రబలిందన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ, ఆ ప్రార్థనల్లో పాల్గొన్న వారిలోనే కరోనా పాజిటివ్ కేసులు కనిపించడం ఆందోళన రేపుతోంది.
మార్కజ్‌లో ఈ నెల 13 నుంచి 15 వరకు మత ప్రార్థనలు జరిగాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 500 మంది పాల్గొన్నారు. వీరిలో మెజారిటీ వ్యక్తులు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వారు ఒక ట్రైన్‌లో వచ్చారు. వారే కాకుండా అనంతపురం, కడప, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారు కూడా ఉన్నారు. వీరిలో సుమారు 200 మంది నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
వీరిలో ప్రకాశం జిల్లాకు చెందిన 103 మంది ఉన్నారు. వారందర్నీ ఒంగోలు, మార్కాపురం, చీరాలల్లో క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచారు. విజయవాడ వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన యువకుడు మార్కజ్ ప్రార్థనల్లో పాల్గొని వచ్చాడు. అతని తల్లిదండ్రులిద్దరూ మరణించారు. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. అదే కార్యక్రమానికి వెళ్లి వచ్చిన వ్యక్తి రాజమండ్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించాడు.
అనంతపురం జిల్లా లేపాక్షిలో మక్కాకు వెళ్లి వచ్చిన మహిళ బెంగళూరులో మృతి చెందగా, ఆమె పదేళ్ల కుర్రాడిలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో అతనిని హిందూపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక రాజమండ్రిలో కరోనా అనుమానిత లక్షణాలతో 40 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో మార్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారు 17 మంది ఉన్నారు. వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
నిన్న మొత్తం 68 కరోనా అనుమానంతో నమూనాలు పరీక్షించగా 66 కేసుల్లో నెగిటివ్ వచ్చినట్టు తేలింది. మిగిలిన ఇద్దరికి కరోనా నిర్ధారణ అయింది. వారిద్దరూ మార్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నట్టు తేలింది. దీంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23కి చేరింది. వైజాగ్‌లో 6, గుంటూరు, విజయవాడల్లో నాలుగేసి కేసులు, కాకినాడ, ప్రకాశం జిల్లాల్లో మూడేసి కేసులు, తిరుపతి, నెల్లూరు, కర్నూలుల్లో చెరొక్క కేసు నమోదయ్యాయి.
Tags: corona virus, covid-19, andhrapradesh, delhi markaz, preyers,