- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దెబ్బతిన్న కోలుకుంటాం.. ధీటైన బదులిస్తాం.. చర్చలకు మేం రెడీ!
దిశ, భద్రాచలం : పీఎల్‌జీఏని మట్టుబెట్టాలనే లక్ష్యంతో భారీ సంఖ్యలో వచ్చిన భద్రతా బలగాలతో వీరోచితంగా పోరాడాం. తమపై మూకుమ్మడిగా దాడికి వచ్చిన పోలీసు బలగాలపై తమ పీఎల్‌జీఏ బలగాలు జరిపిన ప్రతిదాడిలో 23 మంది పోలీసులు చనిపోగా, ఒకరు బందీగా దొరికారని, ఈ పోరాటంలో తాము నలుగురిని కోల్పోయామని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రకటించింది. ఆ మేరకు డీకెఎస్‌జడ్‌సీ అధికార ప్రతినిథి వికల్ప్ పేరుతో ప్రకటన విడుదల చేశారు. దీంతో ఇరుపక్షాలకు నష్టం జరిగిందనేది తేటతెల్లమైంది. అయితే, ఇంత నష్టం జరిగిన తర్వాత కూడా మావోయిస్టులు తమ ప్రకటనలో ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని పేర్కొనడం, అలాగే 23 మంది జవాన్లను మట్టుబెట్టామని చెబుతూనే, మరోవైపు చనిపోయిన పోలీసుల కుటుంబాలకు సంతాపం ప్రకటించడం వంటి అంశాలు ప్రధాన చర్చనీయాంశమైనాయి. ప్రకటన సారాంశం ప్రకారం.. ‘సమాధాన్ – ప్రహార్ పేరుతో పీఎల్‌జీఏని నిర్మూలించే పథకంతో సుమారు 2 వేల మంది బలగాలతో దాడికి వచ్చారని వికల్ప్ తన ప్రకటనలో పేర్కొన్నారు. 2020 ఆగస్టులోనే అమిత్ షా నాయకత్వంలో ఢిల్లీలో జరిగిన పోలీసు అధికారుల సమావేశంలోనే నిర్ణయించారని, దానికి కొనసాగింపుగానే విజయకుమార్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వెంకటాపురంలో జరిగిన ఐదు రాష్ట్రాల పోలీసు అధికారుల సమావేశంలో క్షేత్రస్థాయి సైనికదాడికి పథకం పన్నారని పేర్కొన్నారు. 2020 నవంబర్ నుంచి ప్రారంభమైన దాడుల్లో ఇప్పటికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు 150 మంది చంపబడ్డారని పేర్కొన్నారు.
ఈనెల 3న జీరగూడెం వద్ద పోలీసు బలగాలు తమపై దాడికి వస్తే సాహసోపేతంగా ప్రతిదాడి చేసినట్లు పేర్కొన్నారు. 23 మంది పోలీసులు చనిపోగా, 30 మంది గాయపడ్డారని, ఒకరు చిక్కారని పేర్కొన్నారు. దీనికి ముందే జీరగూడెం గ్రామస్థుడు మడివి చుక్కాలుని పట్టుకొని కాల్చిన పోలీసులు కాల్పుల్లో చనిపోయాడని బూటకపు ప్రచారం చేశారని ఆరోపించారు. ప్రతిదాడిలో ఓడి సన్ని, పద్దమ్ లక్మా, కోవాసి భద్రు, నూపా రమేశ్ అమరులైనారని, సన్నీ మృతదేహం తాము తెచ్చుకోలేకపోయామని, మిగిలిన ముగ్గురి మృతదేహాలకు ప్రజల సమక్షంలోనే అంతిమ సంస్కారాలు విప్లవ సాంప్రదాయాలతో పూర్తి చేశామని పేర్కొన్నారు. నిజానికి తమకు పోలీసులు శత్రువులు కాదని, పాలకవర్గాలు తెచ్చిపెట్టిన అన్యాయమైన యుద్ధంలో బలి కావొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనలో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఈ దాడిలో పీఎల్‌జీఏ 14 ఆయుధాలను, 2 వేలకుపైగా తూటాలను యుద్ధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.
ప్రజలను, వనరులను, ప్రజా సంపదలను కాపాడుకోవడంలో భాగంగా పీఎల్‌జీఏ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రతిదాడి చేయవలసి వస్తోందని వివరణ ఇచ్చారు. చర్చలకు తాము సిద్ధమే అని, అయితే ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లేదని పేర్కొన్నారు. గతంలో జరిగిన అనేక చర్చల సందర్భాల్లో ఉద్యమకారులు ఎప్పుడు ఆయుధాలు విడిచింది లేదన్నారు. చర్చలకు సానుకూల వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. బలగాల మోహరింపులు, క్యాంపుల నిర్మాణం, దాడులు నిర్బంధాలను నిలిపివేస్తే చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. అలా కాకుండా బలగాలతో దాడులు చేస్తున్నందుకే కొండగావ్ నారాయణపూర్, బీజాపూర్ జిల్లాలో జరిగినలాంటి ప్రతిదాడుల్లో పోలీసులు చనిపోతూ ఉంటారని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. చర్చల కోసం ప్రభుత్వం నిర్దిష్టంగా మధ్యవర్తుల పేర్లు ప్రకటిస్తే, తమ వద్ద బందీగా ఉన్న జవాన్‌ని విడుదల చేస్తామని అప్పటివరకు జనతన సర్కార్‌ల రక్షణలో అతడు క్షేమంగా ఉంటారని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిథి వికల్ప్ వెల్లడించారు.