- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ చెంత ఆస్తులు పోగేసుకుని.. వాటి రక్షణకు బీజేపీలో చేరిన ఈటల
దిశ ప్రతినిధి, కరీంనగర్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంపై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. కేసీఆర్ బర్రెలు తినేటోడైతే ఈటల గొర్రెలు తినేటోడని.. దొందు దొందేనని మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ విమర్శించారు. బుధవారం మీడియాకు విడుదల చేసిన లేఖలో అటు సీఎం కేసీఆర్, ఈటలపై మండిపడ్డారు. తెలంగాణలో ఫ్యూడల్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానన్న రాజేందర్ ఫాసిస్టు పార్టీలో చేరడం ఎంటనీ ప్రశ్నించారు. ఆర్ఎస్‌యూ నుంచి ఆరెస్సెస్ వరకు అందరినీ కలుపుకుని ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తానన్న ఈటల.. ఆ వెంటనే బీజేపీలో చేరడంపై జగన్ అసహనం వక్తంచేశారు.
ఇంతకాలం కేసీఆర్ పక్కన ఉన్న రాజేందర్ తన ఆస్తులను పెంచుకోవడంలో భాగంగానే అసైన్డ్ భూములు అక్రమించుకున్నాడని ఆరోపించారు. హుజురాబాద్‌లో మళ్లీ గెలిచేందుకే ఆత్మగౌరవం కోసం అంటూ నినాదం ఇస్తున్నాడని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలకు, రాష్ట్రంలోని కేసీఆర్ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేస్తుంటే ఈటల రాజీనామా చేసి ప్రజలను మోసం చేస్తున్నాడని లేఖలో పేర్కొన్నారు. ఆర్ఎస్‌యూ, ఆరెస్సెస్‌లను ఒకే విధంగా ఈటల రాజేందర్ పోల్చడంపై మావోయిస్టు నేత జగన్ ఆభ్యంతరం వ్యక్తం చేశారు.