బ్రేకింగ్.. మావోయిస్టు పార్టీ చర్ల ఎల్‌వోఎస్ సభ్యుల లొంగుబాటు

by Sridhar Babu |
బ్రేకింగ్.. మావోయిస్టు పార్టీ చర్ల ఎల్‌వోఎస్ సభ్యుల లొంగుబాటు
X

దిశ, భద్రాచలం టౌన్ : ప్రభుత్వ నిషేధిత మావోయిస్టు పార్టీ చర్ల ఎల్‌వో‌ఎస్ సభ్యులు ఇద్దరు భద్రాద్రి కొత్తగూడెం ఎస్‌పీ సునీల్‌దత్ సమక్షంలో లొంగిపోయారు. వివరాల ప్రకారం.. చర్ల మండలం పెద్దమిడిసిలేరు పంచాయతీ కమలాపురంలో నివాసం ఉంటున్న గట్టుపల్లి సురేశ్(25), బోడిక భీమయ్య(25) అనే ఇద్దరు యువకులు చర్ల ఎల్‌వో‌ఎస్ సభ్యులుగా పనిచేశారు.

ఆరేళ్ళ క్రితం వీరు మిలీషియా సభ్యులుగా చేరి యాక్టివ్‌గా పనిచేసి మూడేళ్ళ క్రిందట ఎల్‌వో‌ఎస్‌లోకి ప్రమోట్ అయ్యారు. నాయకుల వైఖరి నచ్చకపోవడంతో లొంగిపోయినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఎస్‌పీ మాట్లాడుతూ.. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నాయకులు వారి క్రింది స్థాయి క్యాడర్‌‌ను వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇది నచ్చక జనజీవన స్రవంతిలో కలవాలనుకునే వారికి అడ్డుపడుతున్నారని, పార్టీలో పనిచేసే మహిళలను, అమాయకులైన గిరిజన పిల్లలను మావోయిస్టు నాయకులు వేధిస్తూ, గ్రామాల నుంచి బలవంతంగా లాక్కెల్లి పార్టీలో పని చేయించుకుంటున్నారని ఆరోపించారు.

చాలా మంది దళ సభ్యులు, మిలీషియా సభ్యులు మావోయిస్టు పార్టీని వీడి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దళ సభ్యులు, మిలీషియా సభ్యులు తమ బంధువుల ద్వారా పోలీసుల ఎదుట లొంగిపోయి ప్రశాంత జీవనాన్ని గడపాలని ఎస్‌పీ సునీల్‌దత్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌పీఎఫ్ కమాండెంట్ హరి ఓం ఖారే, సెకండ్ ఇన్ కమాండెంట్ ప్రమోద్ పవార్, భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్‌, చర్ల సీఐ బి. అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed