- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
25న మావోయిస్టుల తెలంగాణ బంద్
దిశ, క్రైమ్‌బ్యూరో: విప్లవ కవి వరవరరావుతో పాటు అర్బన్ నక్సల్స్ పేరుతో అక్రమంగా అరెస్టు చేసిన 12మందిని బేషరతుగా విడుదల చేయాలని, అడవుల నుంచి గ్రేహౌండ్స్ బలగాలను ఉపసంహరించుకోవాలని సీపీఐ (మావోయిస్టు) తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హిందూ ఫాసిస్టులైన ప్రధాని మోడీ, అమిత్ షాతో జత కలిసిన సీఎం కేసీఆర్ కుట్రలను బహిర్గతం చేసేందుకు ఈ నెల 25న తెలంగాణ రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. సీపీఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి పేరుతో జగన్ మంగళవారం పత్రికా ప్రకటన విడుదలైంది.
వరవరరావు, ఇతర ప్రజాస్వామికవాదులు జైలులో అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నా, బెయిల్ మంజూరుకు అనేక మార్లు విజ్ఞప్తులు చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆ లేఖలో విమర్శించారు. కరోనా ముప్పుతో బాధపడుతున్నా కనీసం కుటుంబ సభ్యులకు కూడా ఆయన ఆరోగ్య విషయాలను చెప్పడంలో నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహారిస్తోందని పేర్కొన్నారు. వరవరరావు విడుదలకు జోక్యం చేసుకోవాలని సీఎం కేసీఆర్‌కు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎందుకు స్పందించడం లేదని జగన్ ప్రశ్నించారు. వరవరరావు తదితరుల అరెస్టు కుట్రలో ప్రధాని మోడీ, అమిత్ షాతో పాటు సీఎం కేసీఆర్ కూడా భాగస్వామి అని ఆరోపించారు.
వరవరరావుతో పాటు సాయిబాబా, ఆనంద్ టెల్టుంబ్డే, సుధా భరద్వాజ్, వెర్నర్ గోంజాల్వేస్, గౌతమ్ నవలాఖ తదితర 12 మంది కవులు, రచయితలు, ప్రజాసంఘాల కార్యకర్తలను అర్బన్ నక్సల్స్ పేరుతో భీమా కొరేగాం కేసులో అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. కరోనా పేరుతో పేదల కడుపు కొట్టడం, ప్రజలపై నిర్బంధాన్ని అమలు చేస్తూ కరోనాను అరికడుతున్నామని పాలకవర్గాలు బూటకపు ప్రచారాలు చేసుకుంటూ వేలాది మరణాలకు కారకులవుతున్నారని విమర్శించారు. విప్లవ కవి, రాజకీయ వేత్త, సామాజిక కార్యకర్త వరవరరావుకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం 50 ఏళ్ళు పోరాటం చేసిన చరిత్ర ఉందని, ఆయనను రక్షించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ‘ఉపా’, ఎన్ఐఏ కేసులను ఎత్తివేయాలని, రాజకీయ ఖైదీలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25న తెలంగాణ రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.