- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మావోయిస్టు వాల్ పోస్టర్ల కలకలం.. వారికి హెచ్చరిక

దిశ, వాజేడు : ములుగు జిల్లాలో కరపత్రాలు కలకలం సృష్టిస్తున్నాయి. వెంకటాపురం మండలం విజయపూర్ కాలనీ గ్రామ సమీపంలోని వాజేడు మండలం నుండి భద్రాచలం వెళ్లే రహదారి ఇరువైపులా ఉన్న చెట్లకు మావోయిస్టుల వాల్ పోస్టర్లు, కరపత్రాలను ఏర్పాటు చేశారు. ఆ కరపత్రాలలో ఈనెల 28వ తేదీ నుండి ఆగస్టు 3 వరకు మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు గ్రామ గ్రామాన జరుపుకోవాలని అమరులైన మావోయిస్టులకు ప్రతి ఒక్కరు జోహార్లు తెలియజేయాలని పేర్కొన్నారు.
ఈ వాల్ పోస్టర్లు కరపత్రాలు చర్ల -శబరి ఏరియా కమిటీ పేరుతో ఉన్నాయి. మారుమూల మన్యం ప్రాంతమైన వెంకటాపురం మండలంలో మావోయిస్టు కరపత్రాలు కలకలం రేపడంతో పోలీసు వర్గాల అప్రమత్తమయ్యారు. మావోయిస్టుల హిట్ లిస్ట్ ఉన్న రాజకీయ నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని వారికి సూచించినట్లు సమాచారం. ఈ వార్తల నేపథ్యంలో మన్యం ప్రాంతంలో ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు