- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మావో వ్యతిరేక వాల్ పోస్టర్ల కలకలం
by Sridhar Babu |
X
దిశ, కాటారం: మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిశాయి. మహాముత్తారం మండలం గండికామారం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఏకంగా స్థూపాలపైనా వాల్ పోస్టర్లు వెలిశాయి. ఒకప్పుటి మావోల ఇలాఖాలో వ్యతిరేక వాల్ పోస్టర్లు ప్రత్యక్షం కావడం స్థానికంగా కలకలం రేపింది. ఆదివాసీల అమాయకత్వాన్ని అడ్డంపెట్టుకుని ప్రగతి నిరోధకులుగా మావోయిస్టులు తయారయ్యారని వాల్ పోస్టర్లలో ముద్రించారు.
ఇటీవల మహాముత్తారం మండలం పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్న క్రమంలో వారికి వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు ప్రత్యక్షం కావడం తీవ్ర చర్చకు దారి తీసింది. కాగా, పొరుగునే ఛత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతం నుండి మావోయిస్టులు తెలంగాణలోకి చొరబడ్డారన్న సమాచారంతో పోలీసులు ఈ ప్రాంతంపై గట్టి నిఘా వేశారు.
Advertisement
Next Story