మణుగూరులో జోరుగా అధికారుల వసూళ్లు.. ఇల్లు కట్టాలంటే..!

by Sridhar Babu |   ( Updated:2021-12-13 23:41:38.0  )
మణుగూరులో జోరుగా అధికారుల వసూళ్లు.. ఇల్లు కట్టాలంటే..!
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో ఓ కలెక్షన్ కింగ్ ఇంటి నిర్మాణానికి 70వేలు వసూళ్ళు చేస్తూ రెచ్చిపోతున్నాడు. మున్సిపాలిటీలో ఇల్లు నిర్మించాలంటే ముందుగా ఈ కలెక్షన్ కింగ్ ని కలిసిన తరువాతే ఇల్లు నిర్మించుకోవాలనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నూతన ఇంటి నిర్మాణ పర్మిషన్ కోసం 50వేల నుంచి 70వేల వరకు వసూళ్ళు చేస్తున్నాడని మున్సిపాలిటీ ప్రజలు మాట్లాడుతున్నారు.

నాఒక్కడికే ఇస్తే ఎలా.. ఆయనకు ఇయ్యరా..?

మున్సిపాలిటీలో పేదవాడు ఇల్లు నిర్మించుకోవాలంటే ఈ కలెక్షన్ కింగ్ మున్సిపాలిటీ ప్రజలకు శాపంగా మారాడనే వదంతులు వినిపిస్తున్నాయి. నూతన ఇంటి నిర్మాణ పర్మిషన్ ఇవ్వడానికి ఈకలెక్షన్ కింగ్ వేలరూపాయలు వసూళ్ల చేయడమే కాకుండా నాపైన వేరే సార్ ఉన్నారు, ఆయనకు ఇయ్యరా అంటు ప్రజలను పిక్కుతింటున్నాడు. ఇంటి పర్మిషన్ పేరుతో లక్షల రూపాయలు ఈకలెక్షన్ కింగ్ వసూళ్ళు చేశారని ప్రజలు వాపోతున్నారు. ఇంతకీ ఈకలెక్షన్ కింగ్ వెనుక ఉన్న సార్ ఎవరు..? నూతన ఇంటి పర్మిషన్ ఇవ్వడానికి లక్షల రూపాయలు వసూళ్ళు చేయడం వెనుక ఎవరున్నారన్నది చిక్కు ప్రశ్నగా మారింది.

నిజానికి ఆ సార్ ఎవరు అనేది మండలంలో ప్రశ్నార్థకంగా మారింది. ఈ కలెక్షన్ కింగ్ నా పైనా సార్ ఉన్నాడని నిజంగా చెప్పుతున్నడా.. లేక ఓ సార్ పేరు చెప్పి ఇంకొంచం వసూళ్లు చేస్తున్నాడా అని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. వేల రూపాయలు ఇస్తేనే నూతన ఇంటికి పర్మిషన్, లేదంటే నో పర్మిషన్.. అనే విధంగా మున్సిపాలిటీ తయారైందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ కలెక్షన్ కింగ్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని, మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో నిఘా పెట్టాలని ప్రజలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed