- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొండెక్కిన గణేశుడు.. తగ్గిన విగ్రహాల తయారీ
దిశ ప్రతినిధి, మేడ్చల్: గ్రేటర్‌లో వినాయక విగ్రహాల కొరత ఏర్పడింది. కరోనా మహామ్మారి వినాయక విగ్రహాల తయారీపై ప్రభావం చూపింది. ఈ సెప్టెంబర్, ఆక్టోబర్ నెలల్లో కొవిడ్ థర్డ్ వేవ్ ముంచుకోస్తుందని ప్రచారం జరగడంతో ఉత్సవాల నిర్వహణ ఏలా ఉండబోతుందోనని వ్యాపారులు భారీ ఎత్తున విగ్రహాలను తయారు చేయలేదని తెలుస్తోంది. కానీ కరోనా ప్రభావం అంతగా లేకపోవడంతో ఈసారి భక్తులు గల్లీ గల్లీలో ఉత్సవాలను నిర్వహించేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో విగ్రహాలకు భారీగా డిమాండ్ పెరిగింది. డిమాండ్ కు తగ్గట్టుగా మార్కెట్ లో విగ్రహాలు లభ్యం కాకపోవడంతో గణేశుడి విగ్రహాల ధరలు కొండెక్కాయి.
భారీ డిమాండ్..
గణేశుడి విగ్రహాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఏకదంతుడి విగ్రహాల ధరలు సుమారు 20-25 శాతం పెరిగినట్లు చెబుతున్నారు. దీనికి తోడు విగ్రహాల తయారీకి వినియోగించే ముడిసరుకులు, రంగులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇనుప చువ్వలు తదితర సామగ్రి ధరలు విపరీతంగా పెరగాయి. ధరలు పెరిగిన దృష్ట్యా ఈ ఏడాది విగ్రహాల ఉత్పత్తి కూడా తగ్గించినట్లు తయారీదారులు పేర్కొన్నారు. దీంతో మార్కెట్లో సరుకు కొరత ఏర్పడి ధరలు విపరీతంగా పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. గత ఏడాది గణపతి విగ్రహాల తయారీకి ఉపయోగించే 35 కేజీల బంకమట్టి సంచి రూ.320 లభించింది. ప్రస్తుతం 20 కేజీల బంకమట్టికి రూ.650 వెచ్చించాల్సి వస్తోందని దూల్ పేటకు చెందిన విక్రమ్ సింగ్ అనే విగ్రహాల తయారీదారుడు తెలిపారు. విగ్రహాలకు తయారుచేసిన తర్వాత వాడే రంగులు 20 శాతం మేర ధరలు పెరిగాయి. భారీ విగ్రహాలకు ఉపయోగించే నాణ్యమైన ఇనుప చువ్వల ధరలు కూడా ఆకాశాన్నంటాయి.
ప్యాక్టరీల మూత..
గిట్టుబాటు కాకపోవడంతో ఇప్పటికే అనేక విగ్రహాలు తయారుచేసే ఫ్యాక్టరీలు మూతపడిపోయాయి. కార్మికులు దొరకడం కూడా కష్టతరంగా మారింది. వారికి చెల్లించే కూలిని రెట్టింపు చేసినా కూలీలు దొరకడం లేదు. వారు డిమాండ్ చేసినంత కూలీ చెల్లించడంతో పాటు భోజనం, బస ఏర్పాటు చేస్తే తప్ప కార్మికులు దొరకడం లేదు. ఈ సౌకర్యాలన్నీ కల్పిస్తే విగ్రహాల తయారీ ఫ్యాక్టరీ యజమానులకు ఏమీ మిగలడం లేదు. ఏటా దూల్ పేట నుంచి భారీ ఎత్తున విగ్రహాలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. ఈసారి ధరలు మండిపోవడంతో అనేక మంది ఫ్యాక్టరీ యజమానులు ముందుగా ఆర్డర్లు స్వీకరించడం మానుకున్నారు. ముఖ్యంగా విగ్రహాల తయారీకి ఉపయోగించే బంక మట్టి గుజరాత్‌లో లభిస్తుంది. అక్కడి నుంచి ట్రక్కులో తీసుకురావడం యజమానులకు గిట్టుబాటు కావడం లేదు. దీంతో కొందరు విగ్రహాలను తయారుచేయడం నిలిపివేసినట్లు వ్యాపారులు తెలియజేస్తున్నారు.