"అంతా బాగుంటం రా".. హృదయాలను కదిలించిన మనోజ్ పాట

by Shyam |   ( Updated:2020-04-19 07:31:19.0  )
అంతా బాగుంటం రా.. హృదయాలను కదిలించిన మనోజ్ పాట
X

మా దేవుడు గొప్పా అంటే మా దేవుడు గొప్పా అని తన్నుకుని చచ్చే మనుషులను… కరోనా మహమ్మారి నుంచి ఏ దేవుడు కాపాడలేకపోయాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చర్చి, మసీదు, గుడి దాటి రాకుండా క్వారంటెన్ పాటిస్తుంటే… ఆ దేవుళ్ల రూపంలో మనల్ని ఆదుకోవడం కోసం వచ్చింది స్టెతస్కోప్ పెట్టుకున్న డాక్టర్లు, లాఠీలు పెట్టుకున్న పోలీసులు, తుపాకులు పెట్టుకున్న ఆర్మీ, నాగలి పెట్టుకున్న రైతన్న, చీపురు పెట్టుకున్న పారిశుధ్య కార్మికులు. ప్రజల కోసం ప్రాణాలు లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ… హీరో మంచు మనోజ్, తన మేనకోడలుతో కలిసి స్వరాంజలి చేశారు. అంతా బాగుంటం రా..అనే పాట ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

” గుండె చెదిరిపోకురా… గూడు వదలమాకు రా.. అంతా బాగుంటం రా… చల్లగుంటాం రా… చక్కగుంటాం రా… చీకటి ఉండిపోదు రా… మళ్లా వెలుగొస్తది రా… అంతా బాగుంటం రా… ” అంటూ సాగే పాటలో కంటికి కనిపించని శత్రువచ్చినా .. నిను కంటికి రెప్పోలే కాసే వైద్యులు , నీ చుట్టూ కంచె వేసిన పోలీసులున్నారు… కానీ నువు మాత్రం బయటకి రావొద్దు… చేయి చేయి కలపబోకు” అంటూ… ఈ పాట ద్వారా సందేశం ఇచ్చారు మనోజ్. అచ్చు రాజమణి సంగీతం అందించగా… కాసర్ల శ్యామ్ రచించిన ఈ పాటను ఎంఎం ఆర్ట్స్ పతాకంపై నిర్మించారు.

Tags : MM Arts, Manoj Manchu, Vidya Nirvana, Antha Bagunnara,manchu Manoj song

Advertisement

Next Story

Most Viewed