- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బ్రేకింగ్ న్యూస్.. టీటీడీ పాలకమండలి సభ్యునిగా మన్నె జీవన్ రెడ్డి
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యునిగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి సోదరుని కుమారుడు.. మన్నె జీవన్ రెడ్డి ఎంపికయ్యారు. దేశంలోని ఆయా రాష్ట్రాలకు చెందిన మొత్తం 25 మందితో కూడిన పాలకమండలి సభ్యులను ఎంపిక చేస్తూ టీటీడీ కొత్త పాలక మండలి సభ్యులను నియమిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రం నుండి మొత్తం నలుగురికి స్థానం దక్కగా అందులో మన్నె శ్రీనివాస్ రెడ్డి ఒకరిగా ఎంపికయ్యారు.
గత ఏడాది పాలకమండలి సభ్యునిగా ఎంపికైన మై హోమ్ అధినేత జూపల్లి రామేశ్వరరావు మరోమారు పాలకమండలి సభ్యునిగా నియామకం కావడం విశేషం. ఆయనతో పాటుగా ప్రస్తుతం యువ నాయకుడు, ఎమ్‌ఎస్ఎన్ కంపెనీ అధినేతల లో ఒకరైన జీవన్ రెడ్డికి పాలకమండలిలో స్థానం దక్కింది. ఎంజేఆర్ సంస్థను స్థాపించి పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం, ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం, రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు ఉన్న జీవన్ రెడ్డికి అవకాశాలు దక్కడం పట్ల మహబూబ్‌నగర్ జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాను టీటీడీ సభ్యునిగా ఎంపిక కావడానికి అన్ని విధాలుగా సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకుని మరిన్ని సేవా, భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తానని జీవన్ రెడ్డి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.