- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, ఫీచర్స్ : హెల్త్ ఇష్యూస్‌తో బాధపడుతున్న మిలన్ తంగం అనే ట్రాన్స్ ఉమన్‌కు ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. దీంతో ఆమె స్నేహితులు సర్జరీ నిమిత్తం తనను బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆపరేషన్ టైమ్‌లో అత్యవసరంగా బ్లడ్ అవసరమవుతుందని, ముందే అరేంజ్ చేసుకోవాలని డాక్టర్లు చెప్పడంతో ట్రాన్స్ కమ్యూనిటీకే చెందిన మిలన్ స్నేహితులు తమ బ్లడ్ డొనేట్ చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ డాక్టర్లు వారి రక్తం తీసుకునేందుకు నిరాకరించారు. అప్పుడు వారు అనుభవించిన బాధ అంతా ఇంతా కాదు. ట్రాన్స్‌జెండర్లు అయినంత మాత్రాన తాము రక్తదానం చేయకూడదా? రక్తదానానికి లైంగికత అవసరమా? అనే ప్రశ్న వారిని తొలిచివేసింది. చివరికి ఓ మహిళ బ్లడ్ డొనేట్ చేయడంతో వారు ఊపిరి పిల్చుకున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. కొవిడ్ సమయంలో చాలా మంది రక్తదాతల కోసం ఎదురు చూశారు. ఈ విషయాలు మణిపూర్‌కు చెందిన ట్రాన్స్ ఉమన్ యాక్టివిస్ట్ శాంత ఖురై దృష్టికి రాగా.. ఆమె బ్లడ్ డొనేషన్‌కు థర్డ్ జెండర్స్ అనర్హులు అని పేర్కొన్న నిబంధనలపై పోరుకు సిద్ధమైంది. అసలు ఈ గైడ్ లైన్స్ ఎవరు ఇచ్చారు? నిజంగానే థర్డ్ జెండర్స్ రక్తదానం చేయొద్దా? ట్రాన్స్‌ఉమెన్ యాక్టివిస్ట్ శాంత ఈ
విషయాలపై తన పోరాటం ఎలా జరపనుంది?
జెండర్(లింగం) ఆధారంగా ఎవరూ వివక్షకు గురికావద్దనే ఉద్దేశంతో సుప్రీం కోర్టు థర్డ్ జెండర్స్‌కు చట్టబద్ధత కల్పించింది. దీంతో వారు గౌరవప్రదంగా జీవించే సిచ్యువేషన్స్ ఏర్పడుతున్నాయి. కానీ ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ వారు రక్తదానం చేయకూడదనే కేంద్ర వైద్య మంత్రిత్వశాఖ గైడ్ లైన్స్ వారిని అవమానపరుస్తున్నాయి. ఈ క్రమంలో ట్రాన్స్ ఉమన్ యాక్టివిస్ట్ శాంత ఖురై ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ వారు రక్తదానం చేయొద్దన్న నిబంధనలపై పోరు ప్రకటించింది. ఈ గైడ్‌లైన్స్ పున:పరిశీలించాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ నిబంధనల వల్ల సొసైటీలో థర్డ్ జెండర్స్ నిస్సహాయులుగా మిగిలిపోతున్నారని, వాటిని సవరించాలని కోరింది. గే, ట్రాన్స్‌జెండర్ అని లింగ వివక్ష చూపడం, వారి రక్తదానాన్ని నిషేధించడం సబబు కాదని పేర్కొంది. పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీం కోర్టు ధర్మాసనం కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్‌ను పున:పరిశీలించనుంది.
ఇదీ ఒక రకమైన వివక్షే..
రక్తదానం చేసి తమలోని దాతృత్వాన్ని చాటుకునేందుకు వచ్చిన ట్రాన్స్‌జెండర్స్‌ను అవమానపరుస్తున్న ఘటనలు నా దృష్టికి వచ్చాయి. లైంగికత కారణంగా రక్తదానం చేయొద్దనడం ఒకరకమైన వివక్షే, హ్యూమన్స్‌గా వారిని గౌరవించకపోవడమే. ట్రాన్స్‌జెండర్, గే అంటూ వారి నుంచి రక్తం తీసుకునేందుకు నిరాకరించడం సబబు కాదు. ఈ విషయాలపై తాను సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ వేశాను. జెండర్ ఐడెంటిటీ, సెక్యువల్ ఓరియంటేషన్ ఆధారంగా ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ హక్కులు హరించివేస్తున్నారనని, గైడ్‌లైన్స్ రాజ్యాంగ ప్రామాణికతను పరిశీలించాలని ధర్మాసనాన్ని కోరాను.
– శాంత ఖురై, ట్రాన్స్‌ఉమన్ యాక్టివిస్ట్
కాగా శాంత పిటిషన్‌పై ప్రతిస్పందన తెలపాలని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, నేషనల్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ కౌన్సిల్‌ను ‘సుప్రీం’ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ లీడర్‌గా తాను సెకండ్ రౌండ్ ఆఫ్ హియరింగ్‌కు హాజరై.. కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ, రెండు ఆర్గనైజేషన్స్ తమ కమ్యూనిటీ పట్ల చూపుతున్న వివక్షను వివరిచేందుకు శాంత ఖురై సిద్ధమవుతోంది. ప్రతీ రాష్ట్రం నుంచి ఒకరు తమ కమ్యూనిటీ తరఫున కేంద్రానికి రెప్రజెంటేషన్ ఇవ్వాలని, స్వతంత్ర ప్రతిపత్తి గల ట్రాన్స్‌జెండర్ కమిషన్ ఉండాలని ఆమె డిమాండ్ చేస్తోంది. అలా కమిషన్ ఉంటేనే తమ హక్కులు సాధించుకోగలమని, సొసైటీలో గుర్తింపు ఉంటుందంటోంది. కేంద్ర గైడ్‌లైన్స్ తొలగించాలన్నది తమ డిమాండ్ కాదని, అవి తొలగించబడితేనే తమ హక్కులు తమకు వస్తాయి కాబట్టి అది తమ హక్కని అంటోంది శాంత.