మంచు విష్ణుపై సీఎం జగన్ సీరియస్.. ఇక ఆపెయ్ అంటూ..

by srinivas |   ( Updated:2021-08-28 07:27:58.0  )
మంచు విష్ణుపై సీఎం జగన్ సీరియస్.. ఇక ఆపెయ్ అంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరంలేదు. ఆ కుటుంబలో ఎవరు ఏమి మాట్లాడినా వైరల్ గా మారుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తాజాగా మంచు వారి పెద్ద కొడుకు మంచు విష్ణు ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూకి వచ్చిన సంగతి తెలిసిందే. అందులో అతగాడు ఎన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. మంచు ఫ్యామిలీకి, సీఎం జగన్ ఫ్యామిలీ బంధువులు అవుతారన్న విషయం తెలిసిందే. మంచు విష్ణు.. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు సుధాకర్ రెడ్డి కుమార్తె విరానికా రెడ్డిని ప్రేమ వివాహం చేసుకోవడంతో వారిమధ్య బంధుత్వం ఏర్పడింది. ఇక ఎప్పుడు ఈ రెండు కుటుంబాలు వేడుకలప్పుడు సందడిచేస్తూ ఉంటాయి. ఇక ఈ షోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ గురించి మంచు విష్ణు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ నెట్టింట వైరల్ గా మారింది.

తనకు పిల్లలంటే ఇష్టమన్న విష్ణు.. పది, పదిహేనుమంది పిల్లలున్నా తనకు ఓకే అంటూ చెప్పుకొచ్చాడు. తనకు అమ్మాయిలంటే చాలా ఇష్టమని, తన భార్యకు అబ్బాయి అంటే ఇష్టమని చెప్పుకొచ్చిన విష్ణు పిల్లల విషయంలో తాము ఏది ప్లాన్ చేసి చేయలేదని వెల్లడించారు. ఇక “నాలుగో పాప కడుపులో ఉన్నప్పుడు జగన్ ఇంటికి ఫ్యామిలీతో కలిసి వెళ్ళాం.. అప్పటికే షర్మిలక్క బయటికి వెళ్తుంది.. వెళ్తూ వెళ్తూ విన్నీని చూస్తూ ఎందుకు తనను అలా కష్టపెడతావ్ విష్ణు.. ఇక ఆపేయ్ అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు.

ఆ తర్వాత జగన్ వచ్చి కొద్దిసేపు మాట్లాడారు. “అరే విష్ణు.. ఎందుకు మా సిస్టర్ ని ఇబ్బంది పెడుతున్నావు. నలుగురు పిల్లలు చాలు’ అంటూ కోపంగా మాట్లాడారు. అది సీరియస్ గా మాట్లాడింది కాకపోయినా అందరి చేత నవ్వులు పూయించింది అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. విష్ణుపై నెటిజన్లు సైటైర్లు వేస్తున్నారు. విష్ణు అన్నా.. మీ సినిమాకు ప్రేక్షకులను ఇంట్లోనే పుట్టిస్తున్నావా..? అని కొందరు.. కుటుంబ నియంత్రణ అనేది ఒకటి ఉంటుంది అన్నో.. దాన్ని మర్చిపోయావా అని మరికొందరు సైటైర్లు వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed