భూ తగాదా.. బాబాయిని దారుణంగా చంపిన కొడుకు

by Sumithra |   ( Updated:2021-10-29 01:31:52.0  )
భూ తగాదా.. బాబాయిని దారుణంగా చంపిన కొడుకు
X

దిశ, మాక్లూర్ : మండలంలోని కృష్ణానగర్ గ్రామానికి చెందిన గద్దె సత్యనారాయణ(60)ను తన అన్న కుమారుడు సూర్యచంద్ర.. భూ తగాదా విషయంలో కత్తితో నరికి చంపిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. హత్య అనంతరం ఘటన స్థలానికి సీఐ గురునాథ్, ఏసీపీ వెంకటేశ్వర్లు చేరుకొని పరిశీలించి పంచనామా నిర్వహించారు. క్లూస్ టీం వివరాలు సేకరిస్తున్నది.

ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యనారాయణ, వెంకటేశ్వర్ రావులు అన్నదమ్ములు. వీరిద్దరికీ సంబంధించిన కొంత భూమిని సత్యనారాయణ అమ్ముకోవడంతో.. వెంకటేశ్వర్ రావు కుమారుడు సూర్యచంద్ర గొడవకు దిగాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి మద్యం త్రాగి వచ్చి సత్యనారాయణతో గొడవకు దిగాడు. గొడవలో కత్తితో సత్యనారాయణ డవడపై, మెడపై దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

అనంతరం సూర్యచంద్ర.. 100 కు ఫోన్ చేసి తానే సత్యనారాయణను చంపానని చెప్పడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సూర్యచంద్ర హైదరాబాద్ హోటళ్లలో పనులు చేసుకుంటూ మద్యం సేవిస్తూ ఉండేవాడని స్థానికులు తెలిపారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గురునాథ్ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed