పిల్లి వల్ల గర్భం దాల్చిన మహిళ.. షాక్ లో భర్త

by Shyam |   ( Updated:2020-07-20 11:47:28.0  )
పిల్లి వల్ల గర్భం దాల్చిన మహిళ.. షాక్ లో భర్త
X

దిశ, వెబ్‌డెస్క్: పిల్లి చేసిన పనికి ఓ మహిళ గర్భం దాల్చింది. అవును మీరు విన్నది నిజమే.. ఈ వార్త విన్న ప్రతి ఒక్కరూ షాక్ అవుతుంటే.. ఆ మహిళ భర్త మాత్రం ఏకంగా ఓ బ్లాగ్ పేజీలో అసలు విషయం రాసుకొచ్చాడు. దీంతో వార్త ఒక్కసారిగా వైరల్ అయింది.

పూర్తి వివరాళ్లోకి వెళితే.. చాలా వరకు దంపతులు పెళ్లి చేసుకున్నాక కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు చేయించుకుంటున్నారు. ఒకరు లేదా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన అనంతరం ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంటున్నారు. కొంతమంది మాత్రం సాధారణంగా గర్భం రాకుండా కండోమ్ వాడుతున్నారు. ఈ తరహాలోనే ఓ భార్యభర్తలు ఒకరికి జన్మనిచ్చిన తర్వాత పిల్లలు వద్దనుకున్నారు. ఉన్న ఒక్కడితోనే సంతోషంగా ఉందమని ప్లాన్ చేశారు. కానీ, తన భర్తకే తెలియకుండా భార్య రెండో సారి గర్భం దాల్చడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. దానికి కారణం తమ పెంపుడు పిల్లి అని తెలియడంతో అతనికి మతిపోయినంత పనైంది.

అసలు ఏం జరిగిందంటే

ఆ దంపతులు ఓ పిల్లిని పెంచుకుంటున్నారు. అది ఎప్పుడూ బాత్‌ రూమ్‌లో ఉన్న డెస్క్‌లో సేదతీరుతూ ఉంటుందట. కాగా, భార్యభర్తలిద్దరూ కలిసే సమయంలో కండోమ్ ఉపయోగించే భర్త పిల్లి ఉంటున్న డెస్క్‌లోనే వాటిని భద్రపరిచేవాడు. అయితే, పిల్లికి బోర్ కొట్టిందో లేక ఏమైందో తెలియదు గానీ, ఆ కండోమ్ ప్యాకెట్లను కొరికివేసింది. ఆ తర్వాత వాటినే అతడు ఇద్దరు కలిసే సమయంలో ఉపయోగించాడు. దీంతో కొద్ది రోజులకి భార్య గర్భం దాల్చడంతో.. అసలు విషయం తెలుసుకున్న భర్త తన మీద ఓ కథ రాసుకున్నాడు. కండోమ్‌ డ్యామేజ్ అయిందని గమనించకపోవడంతో తన భార్య ఇంకోసారి గర్భవతి అయిందంటూ బ్లాగ్ పేజీలో రాశాడు. అంతే, ఈ న్యూస్ కాస్తా వైరల్ అయింది.

Advertisement

Next Story

Most Viewed