- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టాలీవుడ్‌పై మమ్ముట్టి కన్ను.. తెలుగులో ‘గ్రేట్ శంకర్’

దిశ, సినిమా : మలయాళంలో మెగాస్టార్ మమ్ముట్టి.. తెలుగు ప్రేక్షకులకు డబ్బింగ్ సినిమాల ద్వారానే పరిచయం. అయితే గతంలో కళాతపస్వి కె విశ్వనాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘స్వాతికిరణం’తో పాటు వైఎస్ఆర్ బయోపిక్‌గా తెరకెక్కిన ‘యాత్ర’ వంటి స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్స్‌లోనూ ఆయన నటించారు. ఇక లేటెస్ట్ మూవీ విషయానికొస్తే.. అజయ్ వాసుదేవ్ దర్శకత్వం వహించగా మలయాళంలో అఖండ విజయం సాధించిన ‘మాస్టర్ పీస్’ చిత్రాన్ని ‘గ్రేట్ శంకర్’గా తెలుగులోకి అనువదిస్తున్నారు.
శ్రీ లగడపాటి భార్గవ సమర్పణలో లగడపాటి శ్రీనివాస్ శ్రీ ఎల్‌వీఆర్ సంస్థ నుంచి వస్తున్న చిత్రంలో కోలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో కనిపించనుంది. టాలీవుడ్‌లో ‘క్రాక్, నాంది’ వంటి సినిమాల్లో పోషించిన పాత్రల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న ఆమె..
ఈ చిత్రంలో ఏసీపీ క్యారెక్టర్ ప్లే చేస్తోంది. మంచి కథాబలంతో మర్డర్, థ్రిల్లర్, మిస్టరీ అంశాలకు తోడు ఉత్కంఠ భరితంగా సాగే కథనంతో ప్రేక్షకులను అలరించనుంది. దీపక్ దేవ్ మ్యూజిక్ అందించిన మూవీలో భాగమతి ఫేమ్ ఉన్ని ముకుందన్, పూనమ్ బజ్వా తదితరులు నటిస్తుండటం విశేషం.