ఆమె కీర్తి అజరామరం

by Shyam |
ఆమె కీర్తి అజరామరం
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: కూచిపూడి శాస్త్రీయ నృత్యంలో అగ్ర నర్తకిగా, గురువుగా, నృత్య దర్శకులుగా శిఖరాయమానంగా ఎదిగిన డాక్టర్ శోభానాయుడు కీర్తి అజరామరమని రాష్ట్ర సాంస్కృతిక శాఖ
సంచాలకుడు మామిడి హరికృష్ణ అన్నారు. దిగ్గజాలకు మరణం ఉండదని, భౌతికంగా ఆమె లేకపోయానా తెలుగు శాస్త్రీయ , నృత్య రంగంలో ఆమె శాశ్వతంగా నిలిచిపోతారని ఆయన పేర్కొన్నారు. నాంపల్లిలోని తెలుగు విశ్వ విద్యాలయం నృత్య శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ శోభానాయుడు సంస్మరణ సభను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మామిడి హరికృష్ణ మాట్లాడుతూ…. కూచిపూడి నృత్యం ఉన్నంత కాలం, భామా కలాపంలోని సత్యభామ మువ్వల సవ్వడిలో సూక్ష్మ రూపంలో శోభానాయుడు ఆత్మ మనకు కన్పిస్తుందని అన్నారు. కూచిపూడి నృత్యానికి శాస్త్రీయతను శాస్త్ర కారులు వర్తింపజేస్తే దానికి శోభాయమానంగా అందాన్ని ఆమె అనువర్తింప జేశారని కొనియాడారు.

Advertisement

Next Story

Most Viewed