- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'నందిగ్రామ్ ఫలితంపై కోర్టుకెళ్తా'
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ మెజార్టీని బెంగాలీల విజయంగా పార్టీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ అభివర్ణించారు. బెంగాల్ ఈ దేశాన్నే కాపాడిందని చెప్పడానికి గర్వపడుతున్నారని అన్నారు. తృణమూల్ కార్యకర్తలు కృషితోనే పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకుందని తెలిపారు. ఎన్నికల సంఘం బీజేపీ ప్రతినిదుల్లా వ్యవహరించిందని, టీఎంసీపట్ల అనుచితంగా వ్యవహరించిందని ఆరోపించారు. బెంగాల్ ప్రచారం తర్వాత తొలిసారిగా ఆమె వీల్ చైర్ నుంచి లేచి నిలబడి మీడియా ముందు మాట్లాడారు. 221 స్థానాల్లో గెలిచే టార్గెట్‌ను నిర్దేశించారని పేర్కొన్న దీదీ.. తాము డబుల్ సెంచరీ సాధిస్తున్నామని తెలిపారు. దాదాపుగా తాము టార్గెట్ అందుకున్నట్టు భావిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రజలు విజయోత్సవాలకు దూరంగా ఉండాలని, ర్యాలీలు, సంబురాలు చేసుకోవద్దని సూచించారు. కరోనాను ఓడించిన తర్వాత విజయోత్సవ ర్యాలీ చేద్దామని అన్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత బ్రిగేడ్ పరేండ్ గ్రౌండ్‌లో భారీ ర్యాలీ తీద్దామని చెప్పారు. కరోనాపై పోరాటమే తమ ప్రథమ ప్రాధాన్యత అని దీదీ అన్నారు. ‘కొవిడ్ మా తొలి ప్రాధాన్యత. మేం దీనిపై వెంటనే పనిమొదలుపెడతాం. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పెద్దగా నిర్వహించం. ఈ తుఫాన్‌ను మేం ఎదురీదుతాం. మేం అందరికీ ఉచితంగా టీకా అందిస్తాం. అందరికీ ఉచితంగా టీకా అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ఇది జరగకుంటే కోల్‌కతాలోని గాంధీ విగ్రహం ముందు ధర్నాకు దిగుతా’ అని మాట్లాడారు.
నందిగ్రామ్ గురించి దిగులు వద్దు
నందిగ్రామ్ ఫలితంపై గందరగోళం నెలకొనడంపై దీదీ స్పందించారు. ‘నందిగ్రామ్ గురించి దిగులు వద్దు. ఇక్కడి నుంచి నేను ఉద్యమాన్ని నడిపాను. అందుకే పోరాడాను. అయినా సరే. ఇక్కడి ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తా. దాన్ని పట్టించుకోను. మేం 221 సీట్లు గెలిచాం. బీజేపీ ఓడిపోయింది. వాళ్లు నీచమైన రాజకీయాలు చేశారు’ అని అన్నారు.
నందిగ్రామ్ ప్రజల తీర్పును ఆహ్వానిస్తున్నారని దీదీ అన్నారు. కానీ, ఫలితం ప్రకటన తర్వాత కొన్ని కుట్రలు జరిగినట్టు తన దగ్గర సమాచారమున్నదని చెప్పారు. దీనిపై కోర్టుకెళ్లనున్నట్టు తెలిపారు. న్యాయస్థానంలో వాటిని వివరిస్తారని అన్నారు.
లెక్కింపు ఇంకా పూర్తవ్వలేదు.. గందరగోళం వద్దు: టీఎంసీ
నందిగ్రామ్ స్థానం నుంచి 1200 ఓట్లతో సువేందు అధికారిపై మమతా బెనర్జీ గెలుపొందారని తొలుత వార్తలు వచ్చాయి. తర్వాత సుమారు 1600 ఓట్ల తేడాతో దీదీనే ఓడిపోయారని రిపోర్టులు వచ్చాయి. దీంతో టీఎంసీ స్పందిస్తూ ఓ ట్వీట్ చేసింది. నందిగ్రామ్‌లో ఇంకా కౌంటింగ్ పూర్తవ్వలేదని, కాబట్టి, అంచనాలు ప్రచారం చేయవద్దని, గందరగోళానికి గురవ్వవద్దని సూచించింది.