- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దీదీకి గిట్టకుంటే.. ఐఏఎస్‌లు ట్రాన్స్‌ఫరే!
– మూడు వారాల్లో ఐదుగురు అధికారులు బదిలీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఐఏఎస్ అధికారుల పాలిట కలకత్తా కాళి అవుతున్నారు. ఆమెకు గిట్టకుంటే వారిపై బదిలీ వేటువేస్తున్నారు. లాక్‌డౌన్ కాలంలో ఈ మహమ్మారితో పోరాడే కీలకమైన శాఖల బాధ్యతల్లో ఉన్నవారినీ ట్రాన్స్‌ఫర్ చేస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నది. కేవలం మూడు వారాల్లోనే ఐదుగురు సివిల్ సర్వెంట్‌లను మమతా సర్కారు బదిలీ చేసింది. దీదీ కనుసన్నుల్లో నడవని అధికారులకే ఈ ముప్పు ఎదురవుతున్నదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
పశ్చిమ బెంగాల్‌లో కరోనా కేసులు రెండు వేల మార్కును దాటాయి. రాష్ట్ర సర్కారు కరోనా మహమ్మారిని సరైన విధంగా ఎదుర్కోవడం లేదని కేంద్రం సహా పలు నేతల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. కరోనా విషయంలోనూ కేంద్రం రాజకీయాలు చేస్తున్నదని పీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో దీదీ తిప్పికొట్టే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. కరోనాపై పోరులో బెంగాల్ ప్రభుత్వంపై వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో కీలక బాధ్యతల్లో ఉన్న ఐఏఎస్‌ల బదిలీలు జరగడం గమనార్హం.
తాజాగా, కరోనాపై పోరులో ప్రధాన పాత్ర పోషించే హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వివేక్ కుమార్‌ను మంగళవారం ఉదయం బదిలీ కావడంపై చర్చ జరుగుతున్నది. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వివేక్ కుమార్ కంటే ముందు ఫుడ్ అండ్ సప్లైస్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ మనోజ్ అగర్వాల్, అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ మున్సిపల్ అఫైర్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సుబ్రతా గుప్తా సహా ఇద్దరు జిల్లా మెజిస్ట్రేట్‌లనూ మమతా సర్కారు ట్రాన్స్‌ఫర్ చేసింది.
కొవిడ్ 19 కట్టడికి అనుసరిస్తున్న విధానాలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వివేక్ కుమార్‌కు మధ్య అభిప్రాయాలు కుదరలేదని, అటు తర్వాతే ఈ ట్రాన్స్‌ఫర్ జరిగిందని సమాచారం. హెల్త్ డిపార్ట్‌మెంట్ పనితీరుపై వివేక్ కుమార్ అసంతృప్తిగా ఉన్నారని, అనంతరం వాలంటరీ ట్రాన్స్‌ఫర్‌ను కోరినట్టు తెలిసింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపైనా వివేక్.. మీడియా సమావేశంలో వివరించే అవకాశానికి నోచుకోలేదని, దాదాపు 40 రోజుల్లో మరో అధికారి వివరాలు వెల్లడించగా.. కేవలం ఒక్కరోజు మాత్రమే వివేక్ కరోనా వివరాలను మీడియాకు తెలిపారు. అలాగే, అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ మున్సిపల్ ఎఫైర్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సుబ్రతా గుప్తాకు మమతకు మధ్య పొసగలేదు. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేనందుకు కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ సహా 93 పురపాలక సంఘాలకు అడ్మినిస్ట్రేటర్‌లుగా అధికారులకే బాధ్యతలివ్వాలని గుప్తా సూచించగా.. ఇందుకు విరుద్ధంగా మమతా సర్కారు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతరం గంటల వ్యవధిలోనే గుప్తాను ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్‌కు ప్రిన్సిపల్ సెక్రెటరీగా బదిలీ చేసింది. అదే రోజు కోల్‌కతా మున్సిపల్ కమిషనర్‌కు అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ మున్సిపల్ ఎఫైర్స్ బాధ్యతలను అదనంగా ఇచ్చింది. అలాగే, ప్రజా పంపిణీ వ్యవస్థ తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం మమతా బెనర్జీ.. ఫుడ్ అండ్ సప్లైస్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ మనోజ్ అగర్వాల్‌ను.. ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రెటరీగా ట్రాన్స్‌ఫర్ చేశారు.
ఈ బదిలీలపై విశ్లేషకులు, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మమతా బెనర్జీ సూచించిన దారిలో నడవనివారు ఇప్పుడు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోకతప్పడం లేదని అంటున్నాయి. ఈ అధికారులెవరూ సీఎం బెనర్జీతో సన్నిహితంగా వ్యవహరించిన దాఖలాలు లేవు.. కేవలం పనికే పరిమితమై ఉండేవారని ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తెలిపారు. బాధాకరమైన విషయమేంటంటే.. కరోనాపై పోరులో కీలకంగా వ్యవహరించే శాఖల నుంచే ఈ బదిలీలు జరిగాయని వివరించారు.