- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆపన్నహస్తం
దిశ,సికింద్రాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆపన్నహస్తం అందించారు. లాక్ డౌన్ పూర్తయ్యే వరకూ ప్రతి రోజూ వెయ్యి మందికి ఉచితంగా ఆహారం అందిస్తానని ఆయన వెల్లడించారు. గాంధీలో చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియలో కూడా నాటకాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటివరకు కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చకుండా తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని అన్నారు. నగరంలోని అనేక శ్మశానవాటికల్లో మృతదేహాలను ఖననం, వారి కుటుంబ సభ్యులు ఆవేదన, అనేక అంశాలు తనను ఎంతగానో కలిచివేశాయన్నారు. గాంధీలో చికిత్స పొందుతున్న పేద ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
‘కంటి మీద కునుకు లేదు. కాలే కడుపుకు మెతుకు లేదు. సేదతీరేందుకు చోటు లేదు. ఆసుపత్రి పడకపై కొన ఊపిరితో కొట్టుమిట్టాడే తమ ఇంటి ప్రాణం లేచి రావాలని దేవుడికి మొక్కుతూ… కళ్లనిండా నీళ్లు నింపుకుని గాంధీ ఆసుపత్రి ముందు దిక్కుతోచక ఎదురు చూస్తోన్న కొవిడ్ బాధితుల కుటుంబ సభ్యుల దీనస్థితి ఇది. ఈ దృశ్యాలు గుండెకు గాయం చేస్తున్నాయి. మనసును మెలిపెడుతున్నాయి. ఓ నాయకుడిగానే కాదు, నాలోని మనిషిని కలచివేస్తున్నాయి అని మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేదనాభరితుల సాయం కోసం ఓ ప్రయత్నం ఇది. ‘’ఆకలి కడుపులకు అన్నం పెట్టే హస్తం’’ ఇది. గాంధీ వద్ద పడిగాపులు కాస్తోన్న బాధిత కుటుంబ సభ్యుల కోసం లాక్‌డౌన్ లో నిత్య అన్నదానం చేయాలని నిర్ణయించాను. వెయ్యి మందికి లబ్ధిచేసే ఈ సాయం మున్ముందు వివిధ రూపాలలో విస్తృతమవ్వాలన్నది ఆకాంక్ష. అలాగే, వారి కుటుంబ సభ్యులు త్వరగా కోలుకుని చిరునవ్వులతో ఇంటికి చేరాలని కోరుకుంటూ గాంధీ ఆసుపత్రి వద్ద కోవిడ్ బాధితుల కోసం సాయంగా వచ్చిన కుటుంబ సభ్యుల ఆకలితీర్చే అన్నదాన కార్యక్రమానికి నేటి నుంచి శ్రీకారం చుడుతున్నాను’ అని తెలిపారు.