- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గజవాహనంపై మలయప్ప స్వామి
దిశ, ఏపీ బ్యూరో: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీమలయప్ప స్వామి గజవాహనంపై కటాక్షించారు. రాజులను పట్టాభిషేకాది సమయాల్లో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహనం చేసే ప్రక్రియ నేటికీ ఉంది. సాయంత్రం ఐదు గంటల సమయంలో మలయప్ప స్వామి ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలతారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో బసంత్‌కుమార్, బోర్డు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, డాక్టర్ నిశ్చిత, శివకుమార్, గోవిందహరి, డీపీ అనంత పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై శ్రీమలయప్పస్వామి దర్శనమిస్తారు.
అక్టోబర్ నెల ఆన్‌లైన్ కల్యాణోత్సవ టికెట్లు విడుదల
అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆన్‌లైన్ కల్యాణోత్సవం టికెట్ల కోటాను టీటీడీ గురువారం విడుదల చేసింది. అక్టోబర్ 16 నుంచి 24 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 25న శ్రీవారి పార్వేట ఉత్సవం ఉన్న కారణంగా ఆ రోజుల్లో కళ్యాణోత్సవం ఉండదు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో కల్యాణోత్సవం టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది. టికెట్లు బుక్ చేసుకునేవారికి రవిక, అక్షింతలు, కలకండ ప్రసాదాన్ని తపాలా శాఖ ద్వారా పంపిస్తారు. ఆన్‌లైన్ కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు(ఇద్దరు) టికెట్ బుక్ చేసుకున్న తేదీ నుంచి 90 రోజుల్లోపు శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని కూడా టీటీడీ కల్పించింది.