లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదు : మాళవిక

by Jakkula Samataha |   ( Updated:2021-06-06 06:32:14.0  )
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదు : మాళవిక
X

దిశ, సినిమా : ‘నేల టిక్కెట్టు’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన క్యూట్ బ్యూటీ ‘మాళవికా శర్మ’..(Malavika Sharma) ‘రెడ్’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. హాట్ హాట్ ఫొటోలు, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ అప్‌డేట్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) వన్ మిలియన్ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న భామ.. రీసెంట్‌గా అభిమానులతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో పాల్గొంది. తను ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నానని, లైఫ్‌ను చాలా ఎంజాయ్ చేస్తున్నానని తెలిపింది.

ఎప్పటికీ ఒకరి మీద డిపెండ్ కాకుండా ఇండిపెండెంట్‌గా ఉండాలనేది తల్లిదండ్రుల సలహాను ఫాలో అయిపోతున్నానని వివరించింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద అసలు నమ్మకం లేదన్న భామ.. కింగ్ ఖాన్ షారుఖ్‌తో వర్క్ చేయడం తన డ్రీమ్ అని తెలిపింది. రియల్ లైఫ్‌లో అడ్వకేట్ కూడా అయిన మాళవిక.. న్యాయవాదిగా కొనసాగేందుకు సినిమాల నుంచి క్విట్ అయ్యే అవకాశమే లేదని స్పష్టం చేసింది.

Image

Image

Image

Next Story

Most Viewed