ఎమ్మెల్సీ కవిత.. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: మాల మాహనాడు

by Shyam |
ఎమ్మెల్సీ కవిత.. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: మాల మాహనాడు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: మాదిగలకు 12 శాతం ఎస్సీ రిజర్వేషన్ లను కల్పిస్తామని ఎమ్మెల్సీ కవిత అనడం సబబు కాదని మాలమహనాడు రాష్ర్ట కార్యదర్శి నాగరాజు అన్నారు. వారికి ఇచ్చిన హమీని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అదివారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గేస్ట్ హౌజ్ లో మాలమాహనాడు జిల్లా అధ్యక్షుడు, బోదన్ మాజీ మున్సిపల్ చైర్మెన్ అనంపల్లి ఎల్లయ్య విలేఖరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ర్ట కార్యదర్శి నాగారాజు మాట్లాడుతు.. తెలంగాణ రాష్ర్టంలో మాదిగలతో సమానంగా మాలలు ఉన్నారని తెలిపారు. రాజ్యంగ పరంగా ఎస్సీలు మొత్తానికి 15 శాతం రిజర్వేషన్ లు ఉన్నాయని కులాల పరంగా విభజించి లేవని పేర్కోన్నారు. ఎస్సీ వర్గికరణ అంశంను సుప్రీం కోర్టు కోట్టివేసిందని, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు వర్గికరణ అంశంను వదిలి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఎస్సీలకు 15 రిజర్వేషన్ సక్రమంగా అమలు అయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా పలు కీలక సంఘాలకు బాధ్యులను నియమించారు. ఈ సమావేశంలో నగర 9 డివిజన్ కార్పొరేటర్ సాయి వర్థన్, నాంది వినయ్, నగర అధ్యక్షులు ఎడ్ల ధన్ రాజ్, జిల్లా కోశాధికారి నీలగిరి రాజు, ఉపాధ్యక్షులు బాలయ్య, బోదన్ డివిజన్ కన్వినర్ బాల్ రాజు తదితరులు పాల్గోన్నారు.

Advertisement

Next Story

Most Viewed