మహీంద్రా విక్రయాలు డౌన్

by Harish |
మహీంద్రా విక్రయాలు డౌన్
X

దిశ, వెబ్‌డెస్క్: మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) అక్టోబర్ నెలలో మొత్తం అమ్మకాలు 14.52 శాతం క్షీణించి 44,359 యూనిట్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ 51,896 యూనిట్లను విక్రయించినట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశీయ మార్కెట్లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు గత నెలలో 1 శాతం పెరిగి 18,622 యూనిట్లకు చేరుకున్నాయని, గతేడాది ఇదే నెలలో 18,460 యూనిట్లుగా ఉన్నాయని పేర్కొంది. వాణిజ్య వాహనాల విభాగంలో కంపెనీ 3,118 యూనిట్లను విక్రయించగా, గతేడాది 7,151 యూనిట్లతో 56 శాతం క్షీణించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే నెలలో ఎగుమతులు 25 శాతం తగ్గి 2,021 యూనిట్లకు చేరుకున్నాయి. ‘సరఫరా వ్యవస్థలో అడ్డంకులు ఉన్నప్పటికీ, యుటిలిటీ వాహనాల్లో 4 శాతం వృద్ధిని సాధించడం పట్ల సంతోషంగా ఉంది. తమ ప్రధాన బ్రాండ్‌లైన స్కార్పియో, బొలెరో, ఎక్స్‌యూవీ 300 వాహనాల అమ్మకాలు మెరుగైన స్థితిలోనే ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల కొత్తగా భారత మార్కెట్లోకి వచ్చిన సరికొత్త థార్ మోడల్ కోసం రికార్డు స్థాయిలో బుకింగ్‌లు వచ్చాయి’ అని ఎంఅండ్ఎం ఆటోమోటివ్ డివిజన్ సీఈవో విజయ్ రామ్ నక్రా చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed