- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దిశ, వెబ్‌డెస్క్: 2021లో వాహన ధరలను పెంచనున్నట్టు దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా మంగళవారం వెల్లడించింది. 2020 ఏడాది ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి ధరల పెంపును కార్ల తయారీదారులు ప్రకటిస్తున్నారు. ముందుగా దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఈ ధరల పెంపు నిర్ణయాన్ని వెల్లడించింది. ఇదే బాటలో కొరియా సంస్థ కియా వచ్చే నెల నుంచి భారత్‌లో తన కార్ల ధరలను పెంచనున్నట్టు ప్రకటించింది. వీటి బాటలోనే మహీంద్రా కూడా దేశీయంగా అన్ని ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచాలని భావిస్తోంది.
ఈ ధరల పెరుగుదల ప్యాసింజర్, కమర్షియల్ వాహనాలన్నిటికీ వర్తిస్తుందని, జనవరి 1 నుంచి ధరలు అమల్లోకి రానున్నట్టు మహీంద్రా కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. వేర్వేరు మోడళ్లలో ధరల పెరుగుదలకు సంబంధించిన వివరాలను త్వరలో తెలియ జేయనున్నట్టు కంపెనీ తెలిపింది. కంపెనీలు చెబుతున్న దాని ప్రకారం..వస్తువుల ధరలు పెరగడం, ఇన్‌పుట్ ఖర్చులు అధిక మవడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ధరల పెరుగుదలను నిర్ణయించినట్టు పేర్కొంది. కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో కార్ల తయారీదారులకు నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఆటో మొబైల్ తయారీదారులు తమ వాహనాల ధరలను గతేడాదే పెంచాలని నిర్ణయించాయి కానీ పరిస్థితుల కారణంగా అమలు చేయలేదు. ప్రస్తుత పరిస్థితులో పెంచక తప్పటంలేదని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.