ఎస్‌యూవీలపై భారీ ఆఫర్లను ప్రకటించిన మహీంద్రా

by Harish |
ఎస్‌యూవీలపై భారీ ఆఫర్లను ప్రకటించిన మహీంద్రా
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా కంపెనీ తన బీఈస్ 6 ఎస్‌యూవీ వాహనాలపై భారీ డిస్కౌంట్లను ఇస్తున్నట్టు ప్రకటించింది. వీటిలో నగదు ఆఫర్‌తో పాటు కార్పొరేట్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ లాంటి పలు ఆఫర్లు ఉన్నాయని తెలిపింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం బొలెరో కారుపై రూ. 24 వేల నుంచి అల్టురస్ జీ4పై రూ. 3 లక్షల వరకు ఈ డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఆఫర్లు ఫిబ్రవరి 28 వరకు ఉండనున్నాయి.

అయితే, ఈ ఆఫర్లు ప్రాంతాలు, డీలర్‌షిప్‌లను బట్టి వ్యత్యాసం ఉంటాయని కంపెనీ పేర్కొంది. మహీంద్రా అల్టురస్ ఎస్‌యూవీ జీ4పై కంపెనీ ఏకంగా రూ. 3 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తుండగా, అందులో రూ. 2.2 లక్షల నగదు ఆఫర్, రూ. 50 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 16 వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ ఇస్తోంది. ఇక, మార్కెట్లో మెరుగైన ఆదరణ ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ 500పై గరిష్ఠంగా రూ. 80 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుండగా, ఇందులో రూ. 36 వేలకు పైగా నగదు ఆఫర్, రూ. 20 వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ. 9 వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్, రూ. 15 వేల వరకు ఇతర ఆఫర్లను అందిస్తోంది.

Advertisement

Next Story