- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర చట్టాలు రైతులకు ఉరితాళ్లు: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన చట్టాలు రైతులకు ఉరితాళ్లుగా మారబోతున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం దేశానికి అన్నం పెట్టే రైతుపై దాడి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా దీక్షలు చేస్తున్న రైతు సంఘాలతో చర్చలు జరిపి పరిష్కరించాల్సిన హోమ్ శాఖ సహాయ మంత్రి కొడుకు తన కారును రైతులపై తీసుకెళ్లి కర్కశంగా వ్యవహరించడం అతి దారుణమన్నారు. ఉత్తర్ ప్రదేశ్ అశాంతికి, హత్యలకు, అత్యాచారాలకు అడ్డాగా మారిపోయిందన్నారు.
లీకులు ఇచ్చి..ఖండిస్తున్నారు: టీపీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్య రెడ్డి
టీఆర్‌ఎస్‌లో ఉనికి లేకుండా పోతుందనే భయంతోనే గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ మారుతున్నట్టు తానే లీకులు ఇచ్చి, ఖండించుకుంటున్నాడని టీపీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్య రెడ్డి వ్యాఖ్యానించారు. గాంధీ భవన్ లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలుగా జిల్లాలో పాల ఉత్పత్తి దారుల సంఘాన్ని, రైతులను నిలువునా ముంచుతున్నారన్నారు. ఆ మదర్ డైరీని అప్పుల ఊబిలో దించిన గుత్తా సోదరులకు జిల్లాలో ఉనికి లేకుండా పోయిందని విమర్శించారు. గుత్తా సోదరుల అవినీతి, అక్రమాలకు విసిగిపోయి, ఇటీవల జరిగిన ఎన్నికల్లో వారిని పక్కకు పెట్టినారని అయోధ్య రెడ్డి అన్నారు. ఇప్పుడు ఏ పదవీ లేకపోవడంతో పాటు రాజకీయాల్లో వారి ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. భవిష్యత్తులో వచ్చే ఎమ్మెల్సీ అవకాశం కూడా ఇస్తారో లేదో అని భయంతో ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు గుత్తా దిగుతున్నాడని అయోధ్య రెడ్డి వ్యాఖ్యానించారు.