ఆరోగ్యానికి ఆరు సూత్రాలు : మహేష్

by  |
ఆరోగ్యానికి ఆరు సూత్రాలు : మహేష్
X

సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి విపరీత పరిస్థితుల్లో కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఆరు విలువైన నియమాలను పాటించాలని కోరుతూ సూచనలు అందించాడు.

1. అతి ముఖ్యమైనది ఇంట్లోనే ఉండండి. ఏదో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.
2. ఏదైనా వస్తువును తాకితే కనీసం 20/30 సెకన్లు మీ చేతులను సబ్బు మరియు నీటితో కడుక్కోవాలని గుర్తుంచుకోండి.
3. మీ ముఖాన్ని, ముఖ్యంగా కళ్లు, నోరు, ముక్కును తాకకుండా ఉండండి.
4. దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు మీ మోచేతులు లేదా టిష్యూ వాడండి.
5. #SocialDistancing యొక్క అవసరాన్ని అర్థం చేసుకుని, మీ ఇంటి లోపల లేదా బయట ఇతర వ్యక్తుల నుండి కనీసం 3 మీటర్ల దూరం ఉండేలా చూసుకోండి.
6. మీకు కరోనా లక్షణాలు లేదా అనారోగ్యం ఉన్నట్లయితే మాత్రమే మాస్క్‌ని వాడండి. మీకు COVID-19 లక్షణాలు ఉంటే దయచేసి డాక్టర్‌ను సంప్రదించండి.

సరైన, నమ్మకమైన సమాచారాన్ని కలిగి ఉండాలని … అనవసర భయాలు పెట్టుకోవద్దని సూచించారు మహేష్ బాబు. మంచిని ఆశిస్తూ ప్రార్థిద్దాం… కలసికట్టుగా ఈ యుద్దాన్ని గెలుద్దామని పిలుపునిచ్చారు ప్రిన్స్.

Tags : Mahesh Babu, Covid 19, CoronaVirus, Ugadi

Next Story