మహారాష్ట్రలో 30వరకు లాక్‌డౌన్

by  |

ముంబయి: మహారాష్ట్రలో ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఉద్ధవ్ ఠాక్రే సర్కారు నిర్ణయించింది. ఒకవేళ ఈ లాక్‌డౌన్‌కు సహకరించకపోతే దాన్ని మరింత పెంచేందుకు వెనుకాడబోమని హెచ్చరించింది. రాష్ట్రంలో పరిస్థితులు అదుపులోకి వచ్చినట్టే కనిపిస్తున్నది కానీ, జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ప్రధాని మోడీతో వీడియో కాన్ఫరెన్స్‌లో ముగించుకున్నాక స్వల్ప వ్యవధిలోనే ఠాక్రే ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. వీడియో కాల్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు సహకరించకుంటే ఈ నెల 30 తర్వాత కూడా లాక్‌డౌన్ పొడిగించాల్సి ఉంటుందని అన్నారు. రెండోదశగా అమలు చేసే ఈ లాక్‌డౌన్‌లో నిబంధనలు మరింత కఠినతరం చేస్తామని వివరించారు. అయితే, కొన్ని రంగాలను ఆ నిబంధనల నుంచి మినహాయించనున్నట్టు తెలిపారు. ఈ విషయమై సర్కారు కసరత్తులు చేస్తున్నదని పేర్కొన్నారు. ముంబయిలోని 60 నుంచి 70శాతం పేషెంట్‌లలో కరోనా లక్షణాలు స్వల్పంగానే కనిపిస్తున్నాయని చెప్పారు. మనదేశంలో అత్యధికంగా కరోనాతో నష్టపోయిన రాష్ట్రం మహారాష్ట్రనే. ఈ రాష్ట్రంలో 110 మంది కరోనా కారణంగా చనిపోగా.. 1,574 మందికి ఈ వైరస్ సోకింది.

Tags: coronavirus, lockdown, maharastra, uddhav thackerey, mumbai, extend

Advertisement

Next Story

Most Viewed