- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వణికిస్తోన్న ఒమెక్రాన్.. ఒకే రోజు అన్ని కేసులా..?
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచానికి పెను సవాలుగా మారిన కరోనా ఇప్పుడు తన రూపాలను మార్చుకొని మరింతగా భయపెడుతోంది. మొన్నటివరకూ సాఫీగా సాగిన జీవతాల్లోకి మళ్లీ చీకటి రోజులు తేవాలని చూస్తోంది. అమెరికా, జపాన్ లాంటి చోట్ల తన ప్రతాపాన్ని చూపుతోన్న ఒమిక్రాన్ ఇప్పుడు భారత్ మీద పడింది. ఇవాళ ఒక్కరోజే మహారాష్ట్రలో 7 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. ఢిల్లీలో ఒకటి మహారాష్ట్రలో 7 కలిపి దేశ వ్యాప్తంగా 8 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికి భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 12 కు చేరింది. ఆదివారం సాయంత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 798 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.
ప్రపంచ ఆరోగ్యసంస్థ అప్రమత్తం చేసిన కొన్ని రోజుల్లోనే భారత్ లో కూడా కేసులు మొదలయ్యాయి. కేవలం 3 రోజుల్లోనే 12 కేసులు నమోదు అయ్యాయి. అంతర్జాతీయ విమానాల మీద నిషేదం విధించాలని దేశంలో చాలా మంది నాయకులు కేంద్రాన్ని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా దేశంలోకి వస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది. అలాగే దేశంలో పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న రాష్ట్రాల సీఎస్ లకు కూడా కేంద్రం గైడ్ లైన్స్ జారీ చేసింది. అక్కడక్కడా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇందులో కొత్త వేరియంట్ కేసులు ఎన్ని అనేది ఇంకా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించలేదు.