మహారాష్ట్రలో వణుకు పుట్టించిన మార్చి

by vinod kumar |
మహారాష్ట్రలో వణుకు పుట్టించిన మార్చి
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో మార్చి నెల వణుకు పుట్టించింది. ఈ ఏడాది మార్చిలో మహారాష్ట్రలో ఏకంగా 6,51,513 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇది గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు నమోదైన కేసుల సంఖ్య 7,38,377తో పోలిస్తే 88.23 శాతం ఉన్నట్టు అధికారులు తెలిపారు. గణాంకాలు పట్టి చూస్తే కరోనా విజృంభణ ఎంత వేగంగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కాగా చాలా మంది కొవిడ్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారనీ..చాలా చోట్ల భౌతిక దూరాన్ని కూడా పాటించకపోవడంతోనే కరోనా కేసులు పెరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నిబంధనలు మరింత కఠినతరం చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అందులో భాగంగా మాస్కు వేసుకోని వారిపై జరిమానాను భారీగా పెంచాలని ప్రభుత్వాన్ని కోరామని చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed