‘ఢిల్లీలో ఓమాట‌.. గ‌ల్లీలో మ‌రో మాట‌.. బీజేపీ చిల్లర రాజకీయాలు’

by Shyam |
‘ఢిల్లీలో ఓమాట‌.. గ‌ల్లీలో మ‌రో మాట‌.. బీజేపీ చిల్లర రాజకీయాలు’
X

దిశ‌, మ‌రిపెడ‌: కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ రైతుల ప‌ట్ల వివ‌క్ష చూపుతోంద‌ని, అర గుండు( రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌), బోడ గుండు ( బీజేపీ ఎంపీ అర‌వింద్‌) రాష్ట్రంలో చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తూ రైతుల‌ను గంద‌ర‌గోళానికి గురి చేస్తున్నారని మ‌హ‌బూబాబాద్ ఎంపీ మాలోత్ క‌విత దుయ్య‌బ‌ట్టారు. సోమ‌వారం ఆమె మ‌రిపెడ మున్సిపల్ కేంద్రంలో నిర్వ‌హించిన శ‌వ‌యాత్ర‌లో పాల్గొని కేంద్ర ప్ర‌భుత్వ దిష్టిబొమ్మ ద‌హ‌నం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ రైతుల కోసం పెట్టుబ‌డి, రైతు బీమా, సాగు నీరు, 24గంట‌ల ఉచిత క‌రెంటె అందిస్తున్నార‌న్నారు. క‌రోనా కాలంలోనూ అప్పులు చేసి రైతుల ప‌థ‌కాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తుంటే.. బీజేపీ నాయ‌కులు రైతుల ప‌క్షానా ఉండి పంట‌ను కొనేలా చూడ‌కుండా సిల్లీ రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

పంజాబ్, బీహార్‌ ఎన్నిక‌ల కోసం వారి ధాన్యాన్ని మొత్తం సేక‌రిస్తూ.. తెలంగాణ రాష్ట్ర ధాన్యాన్ని కొనం అన‌టం ఎంతవ‌ర‌కు సమంజ‌సం అని ప్ర‌శ్నించారు. పార్ల‌మెంట్ స‌మావేశాల స‌మ‌యంలో టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌ను క‌లిసి మొత్తం ధాన్యాన్ని కొన‌సాల్సిందిగా కోరినా, దానికి బ‌దులుగా మేము కొన‌టం వీలు కాదు.. మీరు రాష్ట్రంలో రాజ‌కీయాలు చేసుకోండి అని నిర్లక్ష్య‌పు స‌మాధానం ఇచ్చార‌న్నారు. కేంద్ర మంత్రి కొన‌మ‌ని చెప్ప‌టం, రాష్ట్రంలో బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌, ఎంపీ అర‌వింద్ ప్ర‌తి గింజ మేమే కొంటాం అని చెప్ప‌టం రైతుల‌ను గంద‌ర‌గోళంలో ప‌డేయ‌ట‌మే అన్నారు. ఇప్ప‌టికైనా రాష్ట్రంలో పండిన ప్ర‌తి గింజ‌ను కొనాల‌ని, లేని ప‌క్షంలో తెలంగాణ నుంచి బీజేపీని త‌రిమికొట్టే రోజులు వ‌స్తాయ‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో డోర్న‌క‌ల్ ఎమ్మెల్యే రెడ్యానాయ‌క్‌, జిల్లా గ్రంథాల‌య చైర్మ‌న్ గుడిపూడి న‌వీన్ రావు, మున్సిపల్ చైర్మెన్ గుగులోత్ సింధూర ర‌వినాయ‌క్‌, వైస్ చైర్మ‌న్ బుచ్చిరెడ్డి, ఎంపీపీ గుగులోత్ అరుణ రాంబాబు, జ‌డ్పీటీసీ తేజావ‌త్ శార‌దా రవీంద‌ర్‌, మాజీ ఓడీసీఎంఎస్ చైర్మన్ కుడితి మ‌హేంద‌ర్ రెడ్డి, మాజీ ఎంపీపీ వెంక‌న్న‌, తెరాసా మునిసిప‌ల్ అధ్యక్షుడు ఉప్ప‌ల నాగేశ్వ‌ర‌రావు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సుమంత్‌, కౌన్సిల‌ర్లు వీసార‌పు ప్ర‌గ‌తి శ్రీ‌పాల్ రెడ్డి, గంధ‌సిరి ఉపేంద్ర‌లింగ‌మూర్తి, వార్డుల పార్టీ అధ్య‌క్షులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed