కల్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర

by Shamantha N |
కల్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర
X

దిశ,వెబ్‌డెస్క్: కల్నల్ సంతోష్ బాబుకు కేంద్రం ప్రతిష్టాత్మక మహావీర చక్ర అవార్డును ప్రకటించింది. ఆయన పరాక్రమాన్ని గుర్తించి యుద్ద సమయంలో ఇచ్చే రెండో అత్యున్నత పురస్కారం మహావీరచక్రను ప్రకటించింది. గతేడాది గాల్వన్ లోయలో చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి ఆయన ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. కాగా ఆయనతో పాటు గాల్వన్ లోయలో అమరులైన ఇతర సైనికులకు కూడా గ్యాలంటరీ అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డును రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ఆయన కుటుంబ సభ్యులకు ప్రధానం చేయనున్నారు.

Advertisement
Next Story

Most Viewed